Tillu square Success Meet : టిల్లు సక్సెస్ మీట్ కాదు, దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్

Jr NTR at Tillu square Success Meet : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. వివిధ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు సిద్దు. కేవలం నటుడు గానే కాకుండా రైటర్ గా కూడా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాడు. ఇకపోతే సిద్దు ఎన్ని సినిమాలు చేసినా కూడా సిద్ధూ కి సరైన గుర్తింపు తీసుకొచ్చిన సినిమా అంటే డీజే టిల్లు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాను స్వయంగా తనే రాసుకున్నాడు సిద్దు. ఈ సినిమా తర్వాత సిద్దు రేంజ్ మారిపోయింది అని చెప్పొచ్చు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన డీజే టిల్లు సినిమా అద్భుతమైన కలెక్షన్స్ ను సాధించింది.

డీజే టిల్లు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకని ఈ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా మొదటి షో నుంచే అద్భుతమైన పాజిటివ్ టాక్ ను సాధించుకుంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది. అయితే ఈ సినిమా దాదాపుగా వంద కోట్లు పైగా వసూలు చేసింది. సిద్దు జొన్నలగడ్డ కెరియర్ లో హైయెస్ట్ వసూళ్లు కలెక్షన్స్ సాధించిన సినిమాగా టిల్లు స్క్వేర్ నిలబడింది. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించింది చిత్ర యూనిట్.

టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్, విశ్వక్సేన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సక్సెస్ మీట్ లో త్రివిక్రమ్ మాట్లాడుతూ.. కొద్దిసేపు టిల్లు స్క్వేర్ సినిమా గురించి మాట్లాడిన తర్వాత,
వచ్చే సంవత్సరం అంటే రేపటి నుంచి దేవర నామ సంవత్సరంగా ప్రకటిస్తున్నాను. ఈ 100 పక్కన ఇంకో సున్నా పెట్టి.. ఆయన దేవర మొదలు పెట్టాలని మీ అందరి తరపున మనందరి తరపున, ఎన్టీఆర్ కంటే కొంచెం పెద్దవాడిని కాబట్టి ఆశీర్వదిస్తున్నాను. ఈ టీం అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.” అన్నారు.

- Advertisement -

యంగ్ హీరో విశ్వక్సేన్ మాట్లాడుతూ…

“నేను ఈ వేడుకకు రావడానికి ముఖ్య కారణం ఎన్టీఆర్ అన్నను చూడొచ్చని. అన్నను చూస్తే నాకు మాటలు కూడా రావు. లవ్ యూ ఎన్టీఆర్ అన్న. అంటూ మాట్లాడారు.

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ…

దేవర సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ గురించి చెప్పను. కానీ దేవర కూడా ఇంచుమించు భయం గురించి ఎక్కువ శాతం ఉంటుంది. కల కనడానికి ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని, ఆ కలని సార్ధకం చేసుకోవడానికి, నిజం చేయడానికి భయం ఉండాలి.

Read More : NTR about Devara movie: కాలర్ ఎగరేసుకొని తిరిగే సినిమా

ఇకపోతే ఒక సినిమాకు సంబంధించి సక్సెస్ మీట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన వాళ్ల గురించి మాట్లాడటం అనేది కామన్ గా జరిగేదే. ఇకపోతే టిల్లు స్క్వేర్ సినిమా సక్సెస్ మీట్ లో టిల్లు సినిమాకు మించి దేవర సినిమా గురించి మాట్లాడేవారు ఎక్కువయ్యారు అని చెప్పొచ్చు. ఇది టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ కంటే కూడా దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అని కూడా కొంతమంది అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు