NTR about Devara movie: కాలర్ ఎగరేసుకొని తిరిగే సినిమా

మిర్చి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు కొరటాల శివ. దర్శకుడుగా కంటే కూడా ముందు రచయితగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. కొరటాల శివ రచయితగా చేసిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన హిట్ గా మారి మంచి కలెక్షన్స్ ను వసూలు చేసాయి. అయితే దర్శకుడుగా మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకొని ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరోతో సినిమాను చేసి అవకాశం దక్కించుకున్నాడు కొరటాల.

మహేష్ బాబు హీరోగా చేసిన శ్రీమంతుడు సినిమా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబును చూపించిన విధానం ఆ సినిమా కథ ఆ సినిమా కథలోని సంభాషణలు వాటన్నిటిని కూడా అద్భుతంగా ప్రజెంట్ చేశాడు కొరటాల. ఆ తర్వాత ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. ఆ తర్వాత చేసిన భరత్ అనే నేను సినిమా కూడా మంచి హిట్ అయింది.

అయితే ప్రతి దర్శకుడు కి ఒక ప్రత్యేకమైన టైం నడిచినట్టు కొరటాల శివ కూడా అలానే నడిచింది అని చెప్పొచ్చు. ఎవరికి రాని అవకాశం కొరటాల శివకు దక్కింది. అది మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయటం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని కలలు కన్నారు. అయితే ఆ కలలు కలలానే మిగిలిపోయాయి. స్టార్ డైరెక్టర్ గా అద్భుతమైన సినిమాలు చేసిన పూరి జగన్నాథ్ కూడా చిరంజీవితో సినిమాను చేస్తున్నాడని ఆఫీసియల్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు.

- Advertisement -

ఇకపోతే కొరటాల శివ చిరంజీవితో చేసిన సినిమా ఆచార్య. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది. అయితే కొరటాల శివ చేసిన హిట్ సినిమాలు అన్ని డిజాస్టర్ తో మర్చిపోయారు ప్రేక్షకులు అని చెప్పొచ్చు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మినిమం అంచనాలను కూడా అందుకోలేకపోయింది. సినిమా డైలాగులో చెప్పినట్టు ఈ సినిమాతోనే నేలమట్టంకి వెళ్లిపోయారు కొరటాల శివ అని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ ఎక్కడ బయట కనిపించలేదు. అయితే ఈ సినిమాకి సంబంధించి మెగాస్టార్ చిరంజీవి కూడా కొన్ని సీన్స్ లో ఇన్వాల్వ్ అయ్యారు అంటూ చెప్పుకోచ్చారు కొరటాల. సినిమా రిలీజ్ కంటే ముందే చాలా ఇంటర్వ్యూలో ఏదో చెప్పే ప్రయత్నం కూడా చేశాడు కొరటాల. మొత్తానికి ఆచార్య సినిమా ఫలితం కొరటాల శివను ఆశ్చర్యానికి గురిచేసింది.

ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ తో దేవర అనే సినిమాను చేస్తున్నటువంటి కొరటాల శివ. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. అలానే ఈ సినిమా హిట్ అవ్వడం కొరటాల శివ కూడా చాలా అవసరం. ఈ సినిమా గురించి ఎన్టీఆర్ రీసెంట్ గా కొన్ని సంచలమైన వ్యాఖ్యలు చేశాడు. రీసెంట్ గా డీజెటిల్లు సక్సెస్ మీట్ కి హాజరైన ఎన్టీఆర్ నెక్స్ట్ రాబోయే దేవర సినిమా కాలర్ ఎత్తుకునేలా ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు. నేను ఈరోజు కాలర్ ఉన్న షర్ట్ వేసుకొచ్చాను, సినిమా రిలీజ్ కొంచెం లేట్ అయినా కూడా సినిమా కాలర్ ఎత్తుకునేలా ఉండే ప్రయత్నం చేశామంటూ చెప్పుకొచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు