NTR about Vishwak Sen and Siddhu : ఇండస్ట్రీకి ఇలాంటి డేర్ డెవిల్స్ కావాలి

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంతోమంది బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోస్ లో విశ్వక్సేన్, సిద్దు జొన్నలగడ్డ ఒకరని చెప్పొచ్చు. ప్రస్తుతం వీరిద్దరూ ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని మంచి సినిమాలను ఎన్నుకుంటూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తున్నారు. అయితే వీరిద్దరూ ఇండస్ట్రీలో ఎదగడానికి చాలా కష్టపడ్డారు. కేవలం నటులుగానే కాకుండా వీరిలో మరికొన్ని టాలెంట్స్ కూడా ఉన్నాయని చెప్పొచ్చు.

జోష్, ఆరెంజ్ వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ గుంటూరు టాకీ సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. కేవలం నటుడుగానే కాకుండా రచయితగా కూడా సిద్దు చాలా సినిమాలకి పని చేశాడు. అయితే సిద్దు మల్టీ టాలెంటెడ్ అని చాలా తక్కువ మందికి తెలుసు. ఎన్ని సినిమాలు చేసినా కూడా సిద్ధూ కి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా అంటే డీజే టిల్లు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ సాధించి మంచి వసూళ్లను రాబట్టింది. ఆ సినిమా తర్వాత సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ సినిమాను తెరకెక్కించి ఈ సినిమాతో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టుకున్నాడు. ఈ సినిమా రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ప్రస్తుతం 100 కోట్లకు పైగా ఈ సినిమా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమా 100 కోట్లు వసూలు చేస్తుందని నిర్మాత నాగవంశీ కూడా ఇదివరకే చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ సినిమాకి కాంపిటీషన్లో ఏ సినిమా లేకపోవడం కూడా ఈ సినిమాకి కలిసి వచ్చింది.

అలానే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మరో యంగ్ హీరో విశ్వక్సేన్. వెళ్ళిపోమాకే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విశ్వక్. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో చేసిన ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు. ఆ సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్న విశ్వక్ ఆ తర్వాత తనలో ఉన్న మరో టాలెంట్ డైరెక్షన్ బయటకు తీశాడు. ఫలక్నామా దాస్ అనే సినిమాను తీసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. విశ్వక్సేన్ ఇప్పటివరకు రెండు సినిమాలను డైరెక్ట్ చేశాడు. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను చూసాయి.

- Advertisement -

ఇకపోతే టిల్లు స్క్వేర్ సినిమా సక్సెస్ ఈవెంట్ కి హాజరైన ఎన్టీఆర్ వీరిద్దరి గురించి కొన్ని మాటలు చెప్పుకొచ్చారు. వీరిద్దరికి ఎప్పుడూ చెబుతూ ఉంటానని, వీరిద్దరూ పైకి వస్తారని, ఇండస్ట్రీకి ఇలాంటి డేర్ డెవిల్స్ కావాలని మాట్లాడారు ఎన్టీఆర్. ఇండస్ట్రీకి మీరిద్దరు కూడా చాలా హెల్ప్ అవుతారని వారిద్దరికీ చాలా సందర్భాల్లో చెప్పినట్లు చెప్పాడు ఎన్టీఆర్. వారిద్దరిని అలా చూడటం నాకు చాలా గర్వంగా ఉంది చాలా ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర. ఈ సినిమా అక్టోబర్ లో రిలీజ్ అని ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు