Hi Nanna: అవార్డుల పంట పండించిన హాయ్ నాన్న..!

Hi Nanna.. టాలీవుడ్ లో మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా మారి మంచి విజయాలను అందుకుంటున్న నాచురల్ స్టార్ నాని ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడూ కూడా వైవిద్యమైన పాత్రలలో .. అద్భుతమైన కథతో ప్రేక్షకులను అబ్బురపరుస్తూ ఉంటారు. నాచురల్ స్టార్ నాని, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కాంబినేషన్లో వచ్చిన హాయ్ నాన్న సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు గుర్తింపు పొందినట్టుగా తెలుస్తోంది.

అవార్డ్ పంట పండించిన నాని మూవీ..
ఇంతవరకు పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులను అలరించిన నాని.. ఈ చిత్రం న్యూయార్క్ లో జరిగిన ది ఒని రోస్ ఫిలిమ్స్ అవార్డు ఈవెంట్లో ఎన్నో అవార్డులను సైతం దక్కించుకుంది.. హాయ్ డాడ్ అనే పేరుతో ఓవర్సీస్ లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు.. ఇందులో బెస్ట్ హీరో, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ చైల్డ్ యాక్టర్ ,బెస్ట్ మూవీ ,బెస్ట్ డైరెక్టర్ ,బెస్ట్ డెబ్యూ డైరెక్టర్, బెస్ట్ సౌండ్ ట్రాక్, బెస్ట్ ఎడిటర్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ పెయిర్, బెస్ట్ సినిమాటోగ్రఫీ వంటి భాగాలలో 11 అవార్డులను కూడా సొంతం చేసుకుంది. అందుకు సంబంధించి ఒక ట్వీట్ కూడా వైరల్ గా మారుతోంది.

అవార్డు స్వీకరణ పై చిత్ర బృందం స్పందన..
అవార్డులు గెలుచుకున్నాక చిత్ర బృందం మొత్తం ఆనందాన్ని వ్యక్తం చేశారు.. ఇంత ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ హీరోయిన్ మృణాల ఠాగూర్, డైరెక్టర్ సౌర్యువ్ తమ ఆనందాన్ని తెలియజేశారు.. హాయ్ నాన్న చిత్రం కోసం తాము పడిన కష్టానికి మంచి ఫలితం దక్కింది అంటూ ఈ సినిమాని ఇంతగా సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు అభిమానులకు సైతం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.. డైరెక్టర్ సౌర్యువ్ ఒని రోస్ ఫిలిం అవార్డులను తమ సినిమా గెలుచుకోవడం తమకు చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తోందని వెల్లడించారు.

- Advertisement -

నటీనటులే హైలెట్..
హాయ్ నాన్న సినిమాతో తన కల నెరవేరిందని.. సినిమా కథ బాగా ఉంటే ఎక్కడైనా సరే ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని ఈ చిత్రంలో తను పోషించిన యష్ణ పాత్ర తనకు జీవితాంతం ఒక గొప్ప అనుభూతిని అందిస్తుంది అంటూ మృణాల్ ఠాగూర్ తెలియజేశారు.. నాచురల్ స్టార్ నాని కూడా ఎంతో అద్భుతంగా ఈ సినిమాలో తన నటనని కనబరిచారు. సంగీతాన్ని కూడా హేషమ్ అబ్దుల్లా చక్కగా అందించారు.. అలాగే జయరామ్, బేబీ కియారా ఖన్నా కూడా చాలా కీలకమైన పాత్రలో నటించారు. ఏది ఏమైనా హాయ్ నాన్న సినిమాకి ఇన్ని అవార్డులు రావడంతో అటు నాని అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అటు నానికి చిత్ర బృందానికి కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. మొత్తానికి అయితే అవార్డుల పంట పండించి మరొకసారి వార్తల్లో నిలిచారు నాని అంతేకాదు ఈ సినిమాతో అట మృణాలకి కూడా హాలీవుడ్లో అవకాశాలు వచ్చిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. మరి ఈ ముద్దుగుమ్మ రానున్న రోజుల్లో ఎలాంటి అవకాశాలు అందుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు