Pushpa The Rule : ఫాస్టెస్ట్ 1 మిలియన్ కొట్టిన సినిమాలు.. కొద్దిలో తడబడ్డ పుష్ప..

Pushpa The Rule: టాలీవుడ్ లో స్టార్ హీరోల అభిమానులు థియేటర్ల కలెక్షన్ల రికార్డుల కోసం ఎలా ఆరాటపడతారో, ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఆయా సినిమాల రికార్డుల కోసం అంతే తహతహలాడతారు. ముఖ్యంగా యూట్యూబ్ లో టాప్ స్టార్స్ నటించిన సినిమాల టీజర్ లు, గాని ట్రైలర్ లు గాని, లేక మరే సాంగ్స్ అయినా వస్తే చాలు వాటి రికార్డులతో సోషల్ మీడియా మొత్తం హడావుడిగా ఉంటుంది. ఒక టీజర్ రిలీజ్ అవుతుందంటే చాలు ఫ్యాన్స్ గంటల ముందు నుండి సోషల్ మీడియాలో కాచుకు కూర్చుంటారు. ఇక టాలీవుడ్ స్టార్స్ రీసెంట్ టైంలో పాన్ ఇండియా మూవీస్ చేస్తూ తమ మార్కెట్ ను పెంచుకుంటూ ఉండగా, సినిమాలు మాత్రం ఆలస్యంగా వస్తూ ఉండగా కొత్త రికార్డులు నమోదు అవ్వడానికి చాలా టైమే పడుతూ ఉంది. ఇక రీసెంట్ టైం లో టాలీవుడ్ టీజర్ లలో 1 మిలియన్ లైక్స్ ని అందుకున్న టీజర్ లు చాలా తక్కువే కాగా, మొదటగా ఈ రికార్డ్ ను RRR మూవీలో వచ్చిన ఎన్టీఆర్ ఇంట్రో టీజర్ 1 మిలియన్ లైక్స్ రికార్డ్ ను నమోదు చేసింది. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ ఈ ఈ మార్క్ ని అందుకుంది. కేవలం తెలుగు వర్షన్ టీజర్ ల పరంగా ఈ రికార్డ్ ను ఏ సినిమా టచ్ అయితే చేయలేదు.

పాన్ ఇండియా టీజర్స్ లో సలారోడి తర్వాతే..

ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రూల్ అన్ని భాషలకు కలిపి ఒకే టీజర్ లా రిలీజ్ చేయగా, యూట్యూబ్ లో రిలీజ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఏకంగా 1 మిలియన్ లైకులను కొట్టేసి ఆశ్చ్యర్య పరిచింది. కానీ సింగిల్ ఛానెల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ లలో రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ టీజర్ ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్స్ ను అందుకుంది. ఇక తాజాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప2 టీజర్ (Pushpa The Rule) కూడా 1 మిలియన్ లైక్స్ ను అందుకుంది, కానీ టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకుంది. అయితే పుష్ప ది రూల్ టీజర్ గంటల్లోనే అన్ని రికార్డులు తుడిచిపెట్టి, కెజిఎఫ్ టీజర్ సహా అన్ని రికార్డులని బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ భావించారు. కానీ అది జరగలేదు. బహుశా దానికి కారణం టీజర్ లో కేవలం ఒక ఫైట్ కి సంబంధించిన సీన్ మాత్రమే చూపించడం మాత్రమే జరిగింది. దీని వల్ల ఆడియన్స్ కొంతమేర నిరాశ పడ్డారని చెప్పొచ్చు.

ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్స్ ని అందుకున్న టీజర్స్..

ఇక టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్స్ ని అందుకున్న టీజర్స్ ని గమనిస్తే.. ముందుగా ప్రభాస్ సలార్ టీజర్ 6 గంటల 15 నిముషాలు
పుష్ప ది రూల్ టీజర్ 9 గంటల 59 నిమిషాలు
రామరాజు ఫర్ భీం 36 గంటల 04 నిముషాలు
ఇంట్రడ్యూసింగ్ పుష్ప రాజ్ 59 గంటల 10 నిముషాలు

- Advertisement -

ఇక ఇప్పటివరకు టాలీవుడ్ లో టీజర్స్ అందుకున్న ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్స్ మార్క్ ని అందుకున్న వాటి లెక్క. ఇక ఈ ఇయర్ లో మరిన్ని బిగ్ మూవీస్ టీజర్ లు రిలీజ్ కానున్నాయి. కాబట్టి ఈ లిస్టులో చేరే సినిమాలు మరిన్ని వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఓజి, ప్రభాస్ రాజా సాబ్, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, చిరంజీవి విశ్వంభర లాంటి క్రేజీ సినిమాలకు కొత్త రికార్డులు క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. మరి అందులో ఎన్ని సినిమాలు కొత్త రికార్డులను నమోదు చేస్తాయో చూడాలి. ఇక పుష్ప ది రూల్ 24 గంటల్లో ఎన్ని రికార్డులు నమోదు చేస్తుందో కాసేపట్లో తేలనుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు