Pushpa The Rule : ఒకరకమైన డిస్సపాయింట్ లో ఫ్యాన్స్.. అదే కారణమా?

Pushpa The Rule : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా లేటెస్ట్ గా విడుదలైన ‘పుష్ప ది రూల్’ టీజర్‌ భారీ హైప్ తో విడుదలైన సంగతి తెలిసిందే. ఇక టీజర్ రిలీజ్ అయిన నిమిషాల వ్యవధిలోనే యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ దిశగా పరుగులు తీస్తుంది. విడుదలైన గంటల్లోనే మిలియన్ల కోద్దీ వ్యూస్, లక్షల్లో లైక్స్ రాబట్టాడు. ఫ్యాన్స్ అయితే పుష్పరాజ్ మాస్ జాతరకు ఫిదా అవుతున్నారు. అన్నిటికి మించి అల్లు అర్జున్ లుక్ అయితే మైండ్ బ్లోయింగ్ అనేట్టుగానే ఉంది. ఇక టీజర్ లో మాతంగి అవతారంలో రాక్షస సంహారం చేస్తున్న పుష్పరాజ్, కాళ్లకి గజ్జెలు, కళ్లకి కాటుక చెవులకు బుట్ట కమ్మలు, త్రిశూలం ధరించి చీర చెంగుని కాలితో ఎగరేసి దోపుకుంటూ ఉఫ్ అని భయపెట్టే సీన్‌తో టీజర్ కట్ చేశారు. ఒక నిమిషం నిడివితో ఉన్న టీజర్‌లో అల్లు అర్జున్ లుక్‌ని మాత్రమే ఎస్టాబ్లిష్ చేశారు. అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ అయితే.. పుష్ప‌ని మించి అనేట్టుగా ఉంది. డిఎస్పీ బ్యాగ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవల్ అనేట్టుగా ఉంది. అయితే రిలీజ్ అయిన టీజర్ ద్వారా పుష్ప ఫ్యాన్స్ ఒకరకమైన చిన్న నిరాశకి లోనయ్యారని తెలుస్తుంది.

ఇంత చిన్నగా అయితే ఎలా?

అయితే తాజాగా రిలీజ్ చేసిన పుష్ప ది రూల్ టీజర్ సోషల్ మీడియా లో దుమ్ములేపుతుండగా, కొందరు ఫ్యాన్స్ దృష్టిలో కొన్ని విషయాలలో అంచనాలను అయితే అందుకోలేకపోయిందట. దానికి కారణం టీజర్ బాలేదనో, లేదంటే ఔట్ పుట్ బాలేదనో కాదు, పుష్పరాజ్ పుష్ప 2 ఫైనల్ లుక్‌ని ముందే రివీల్ చేయడం వల్లనే. ఈ సినిమాలో ఇంతకు మించి సాలిడ్ లుక్ ఉండదట. ఇక ఈ టీజర్ నిడివి నిమిషం పైనే అని చెప్పి, టీజర్ లో మాత్రం అల్లు అర్జున్ ని అర నిమిషం మాత్రమే చూపించారని ఫ్యాన్స్ డిస్సపాయింట్ అవుతున్నారు. టీజర్ అసలే చిన్నగా ఉందంటే, అందులో మరీ ఇంత తక్కువ సేపు చూపిస్తే ఎలా అని బన్నీ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేసారు. ఇక అన్నిటికి మించి టీజర్ లో ఒక్క డైలాగ్ అన్నా చెప్పించలేదని మరి కొందరి వాదన. అయితే టీజర్‌లో ఫస్ట్ లుక్ టైం కి సంబంధించిన అదే లుక్‌ని రీ ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా, కొత్తదనం అయితే కనిపించలేదు. అప్పట్లో ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేయకుండా, నేరుగా ఇదే టీజర్‌ని రిలీజ్ చేసి ఉంటే ‘పుష్పరాజ్’ హంగామా నెక్స్ట్ లెవల్‌లో ఉండేది. సర్ ప్రైజ్ అంటే మామూలుగా సర్ ప్రైజ్ కాదు గాని, ఆ గెటప్‌కి ఫిదా అయిపోయేవారు.

ట్రైలర్ పై మరిన్ని అంచనాలు!

ఇక టాలీవుడ్ లో గాని మరె ఇతర ఇండస్ట్రీ లలో గాని సినిమా స్థాయిని ప్రభావితం చేసేవి టీజర్, ట్రైలర్‌లు. అల్లు అర్జున్ బర్త్ డే అని హడావిడిగా ఈ టీజర్‌‌ని రిలీజ్ చేయాల్సి వచ్చిందో లేదంటే, కావాలనే రిలీజ్ చేశారో తెలియదు కానీ.. నేడు విడుదలైన ‘పుష్ప 2’ (Pushpa The Rule) టీజర్‌ని టీజర్ అని కాకుండా.. అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ వీడియో అని, షార్ట్ గ్లింప్స్ వీడియో అనో రిలీజ్ చేసి ఉంటే పెదవి విరుపులు ఉండేవి కావని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. ఫ్యాన్స్ ఓవర్ ఎక్స్ పెక్టేషన్స్ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. ఏది ఏమైనా సోషల్ మీడియా లో పుష్ప ది రూల్ ఓ రేంజ్ రచ్చ చేస్తున్నాడని చెప్పొచ్చు. దీంతో రాబోయే ట్రైలర్ పై మరింత ఆసక్తి నెలకొని ఉంది. ఇక ట్రైలర్ జులై వరకు కానీ రిలీజ్ కాదని తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు