Chiranjeevi : మెగా బ్రదర్స్ పిక్ అఫ్ ది డే… లుక్ రివీల్ అయినట్టేగా!

Chiranjeevi : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ చిత్రాల్లో ఒకటి ‘విశ్వంభర’. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ మూవీ బింబిసార ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొన్ని నెలల కిందే మొదలైన ఏ సినిమా షూటింగ్ 2025 సంక్రాంతి రిలీజ్ నే టార్గెట్ గా పెట్టుకొని శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. అదే సమయంలో సినిమాకు సంబంధించిన ఎలాంటి విషయాలు బయటకి రాకుండా చూసుకుంటున్నారు మేకర్స్. ముఖ్యంగా సెట్స్ నుంచి చిరు లుక్ అండ్ గెటప్ ఇప్పటివరకు లీక్ అవ్వనివ్వలేదు. కానీ ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయకముందే, అనుకోకుండా చిరంజీవి లుక్ బయటకు వచ్చేసింది. పంచభూతాల కాన్సెప్ట్ తో రూపొందుతున్న సోషియో ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ”విశ్వంభర” నుండి ఇప్పటివరకు టైటిల్ గ్లింప్స్, మాత్రమే రిలీజ్ చేయగా, ఇందులో చిరంజీవి లుక్ రివీల్ చెయ్యలేదు. ఇక ఆ మధ్య ఆయన షాడో ఇమేజ్ ను మాత్రమే రిలీజ్ చేశారు. దీంతో బిగ్ బాస్ ఎలాంటి గెటప్ లో కనిపిస్తారో అని ఫస్ట్ లుక్ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పవర్ స్టార్ మీటింగ్ తో రివీల్..

అయితే అన్న మెగాస్టార్ చిరంజీవిని తమ్ముడు పవన్ కళ్యాణ్ తాజాగా కలవడంతో ఈ సందర్బంగా సినిమాలో చిరు లుక్ రివీల్ అయిపోయింది. ఇక అసలు విషయానికి వస్తే .. ‘విశ్వంభర‘ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతలలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో జరుగుతోంది. చిరంజీవి పాల్గొనే కొన్ని కీలకమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తున్నారు. అక్కడ భారీ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సోమవారం ఉదయం అన్నయ్యను కలవడానికి మెగా తమ్ముళ్లు పవన్ కళ్యాణ్, నాగబాబు షూటింగ్ లొకేషన్ కు విచ్చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీకి చిరు 5 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు సోషల్ మీడియాలో తెలియజేస్తూ, కొన్ని ఫోటోలను పంచుకున్నారు. చిరంజీవి సైతం కాస్త ఫిల్టర్ ఉపయోగించి తమ్ముళ్ళతో దిగిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇక మెగా బ్రదర్స్ దిగిన ఈ స్టిల్ పిక్ అఫ్ ది డే గా వైరల్ అవుతుంది. దాదాపు వరుణ్ పెళ్లి తర్వాత వీళ్ళు కలిసిన స్టిల్ ఇది చెప్పొచ్చు. ఇక ఆ పోస్ట్ తో చిరంజీవి విశ్వంభర ఫస్ట్ లుక్ కూడా రివీల్ అయిపోయిందని చెప్పొచ్చు.

మెగా ఆశీర్వాదం..

ఇక తమ్ముడు పవన్ కళ్యాణ్ ని చిరంజీవి(Chiranjeevi) ఆశీర్వదిస్తూ, ట్విట్టర్ లో ఇలా పోస్ట్ చేసారు. “అందరు అధికారంలోకి వచ్చిన తరువాత సాయం చేస్తాం అంటారు. అధికారం లేకపోయినా, తన సంపాదనని రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించటం నాకు సంతోషాన్ని కలిగించిన విషయం. తన స్వార్జితం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేన కి విరాళాన్ని అందించాను” అని పోస్ట్ పెట్టారు. ఈ ఫోటోలలో చిరంజీవి మెరూన్ కలర్ షర్ట్, బ్లూ జీన్స్ ధరించి ఉన్నారు. ఆయన మెడలో ఒక లాకెట్ ఉండటం, సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా బ్యాగ్రౌండ్ లో పెద్ద ఆంజనేయుడి విగ్రహం ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఈ విధంగా ప్లాన్ చెయ్యకుండానే ‘విశ్వంభర’లోని మెగాస్టార్ లుక్ బయటకు వచ్చేసింది. దీంతో ఫస్ట్ లుక్ కోసం ఉండే ఎగ్జైట్మెంట్ మెగా ఫ్యాన్స్ మిస్ అయ్యారని చెప్పొచ్చు. ఇక విశ్వంభర ని యువి క్రియేషన్స్ బ్యానర్ లో విక్రమ్, వంశీ, ప్రమోద్ కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. సుర‌భి, ఈషా చావ్లా, ఆష్రిత వేముగంటి, ర‌మ్య ప‌సుపులేటి తదితరులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు