G.V.Prakash Kumar : నాని దసరా లో ఆ పాత్ర నేనే చేయాల్సింది – జివి ప్రకాశ్..

G.V.Prakash Kumar : కోలీవుడ్ యంగ్ హీరో కమ్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఏఆర్ రహమాన్ మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చి చిన్న వయసులోనే సంగీత దర్శకుడిగా తనదైన చెరగని ముద్ర వేసిన ఈ యువ సంగీత దర్శకుడు ఆ తర్వాత హీరోగానూ పలు సినిమాలు తీయడం స్టార్ట్ చేసాడు. పలు సక్సెస్ లు కూడా అందుకున్నాడు. ఇక తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. జివి ప్రకాష్ కుమార్ , ఐశ్యర్య రాజేష్ జంటగా రూపొందిన కొత్త సినిమా డియర్. కామెడీ, రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా అక్కినేని నాగ చైతన్య లాంచ్ చేయగా, ఈ ట్రైలర్ కి కూడా చై వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. ఇక సోషల్ మీడియాలో ఆ ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గురక వల్ల వచ్చే సమస్యని మేకర్స్ ప్రధానాంశం గా ఎంచుకుని సినిమాగా తీశారు. ఇక ఈ సినిమాకు సంగీతం కూడా స్వయంగా జివి ప్రకాశే సమకూర్చడం జరగగా, రవిచంద్రన్ దర్శకత్వం వహించాడు. ఇక జివి ప్రకాష్ తాను న‌టించిన డియ‌ర్ (Dear) మూవీ విడుద‌ల నేప‌థ్యంలో సోమ‌వారం హైద‌రాబాద్‌లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ముఖాముఖి..

జివి ప్రకాష్ నటించిన డియర్ సినిమా తెలుగు ప్రమోషనల్ ఈవెంట్ లో మేకర్స్ సహా పాల్గొనడం జరిగింది. ఇక తెలుగు నాట ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ అయిన అన్న‌పూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను విడుద‌ల చేస్తుండ‌గా నాగ చైత‌న్య వాయిస్ ఓవ‌ర్ ఇచ్చారు. ఇక ఈ సినిమాను ఏప్రిల్ 12న తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాలను భారీగా పెంచేశాయి. ఈ క్ర‌మంలో ఈ రోజు ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌తో పాటు , మీడియాతో ముఖాముఖి కార్య‌క్ర‌మం నిర్వ‌హించి విలేఖ‌రుల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు మేకర్స్. ఈ నేపథ్యంలో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలని చిత్ర యూనిట్ పంచుకోవడం జరిగింది. ఇక హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఈ ఈవెంట్ లో తన తెలుగు స్పీచ్ తో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. ఇదిలా ఉండగా జివి ప్రకాష్ కుమార్ మాటలు మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారాయి.

దసరాలో ఆ పాత్ర నేను చేయాల్సింది – జివి ప్రకాష్

ఇక డియర్ ప్రీ రిలీజ్ ప్రమోషనల్ ఈవెంట్ లో ఓ మీడియా విలేఖ‌రి అడిగిన ప్ర‌శ్న‌కు జీవీ ప్ర‌కాశ్ కుమార్ (G.V.Prakash Kumar) మాట్లాడుతూ, నాకు తెలుగులో అవ‌కాశాలు వ‌స్తున్నాయి కానీ త‌మిళంలో మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా, హీరోగా బిజీగా ఉండ‌డంతో తెలుగు సినిమాలు అంగీక‌రించ లేకపోయాన‌ని, త్వ‌ర‌లో తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేస్తాన‌ని స్ప‌ష్టం చేశాడు. ప్ర‌స్తుతం ల‌క్కీ భాస్క‌ర్‌, రాబిన్ హుడ్ వంటి నాలుగైదు తెలుగు చిత్రాల‌కు సంగీతం అందిస్తున్నాన‌ని తెలిపాడు. అయితే ఈ క్రమంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల ద‌ర్వ‌క‌త్వంలో వ‌చ్చిన ద‌స‌రా (Dasara.) సినిమాలో ‘సూరి’ పాత్ర‌లో న‌టించే అవ‌కాశం తనకి వ‌చ్చింద‌ని, కానీ నేను వేరే సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో నా డేట్స్ కుద‌ర‌లేద‌ని ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు, హీరో జీవీ ప్ర‌కాశ్ కుమార్ అన్నాడు. అయితే ఈ రోల్ ని కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి భర్తీ చేయడం జరిగింది. ఇక అతను చాలా బాగా పెర్ఫార్మన్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన దసరా వంద కోట్ల వసూళ్ళని రాబట్టి బ్లాక్ బస్టర్ అయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు