Kalki2898AD : ఆ విషయంలో క్లారిటీ వచ్చాకే.. నెక్స్ట్ సినిమాలపై ఫోకస్?

Kalki2898AD : పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి2898AD”. ఈ సినిమాపై పాన్ ఇండియా వైడ్ గానే కాదు ఇంటెర్నేషనల్ వైడ్ గా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. టాలీవుడ్ హల్క్ రానా దగ్గుపాటి ఈ సినిమాను ఇంటర్నేషనల్ రేంజ్ లో ప్రమోట్ చేస్తుండడం విశేషం. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని వైజయంతి మూవీ బ్యానర్ వారు నిర్మిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ తో నేషనల్ వైడ్ గా సాలిడ్ క్రేజ్ ని తెచ్చుకుంది. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ “భైర‌వ” గా నటిస్తున్నాడని క్యారెక్ట‌ర్ నేమ్ రివీల్ చేస్తూ అప్పట్లో ఓ లుక్ కూడా వదిలారు మేకర్స్. ఇక సినిమాని మే 30న రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా ప్రభాస్ దీని తర్వాత చేయబోయే సినిమాలపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ప్రభాస్ కోసం ఒక్కసారిగా నలుగురు డైరెక్టర్లు కాచుకుని కూర్చుని ఉన్నారు. అయితే అందులో ముందుగా మారుతి తో చేస్తున్న రాజా సాబ్ సినిమానే పూర్తి చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్నందువల్ల తొందరగా ఫినిష్ అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రభాస్ కొన్ని కారణాల వల్ల తన తర్వాతి సినిమా షూటింగ్ లపై క్లారిటీ గా లేడని తాజా సమాచారం.

కల్కి2898AD పై పూర్తి పక్కాగా క్లారిటీ రావాల్సిందే!

అయితే ప్రభాస్ ప్రస్తుతం తాను నటిస్తున్న కల్కి2898AD (Kalki2898AD) సినిమాపైనే మొత్తం ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ సినిమా దాదాపు రెండేళ్లుగా తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. ఏకంగా 500 కోట్ల కి పైగా భారీ బడ్జెట్ తో మేకర్స్ నిర్మిస్తున్నారు. మహాభారతాన్ని మోడరేట్ కథని మోడరేట్ చేసి, దాన్ని ఇన్స్పైర్ అయ్యి కూడా ఈ సినిమాని నిర్మిస్తున్నారని పలు వార్తలు వస్తున్నాయి. ఓవరాల్ గా శ్రీ మహా విష్ణువు పదకొండో అవతారం కల్కి ఇతివృత్తం తో మైథలాజి టచ్ ఇస్తూ సినిమా తీస్తున్నారట. అయితే ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావచ్చినా, రిలీజ్ డేట్ ప్రకటించినా కూడా ప్రభాస్ మాత్రం డౌట్ తోనే ఉన్నాడని తెలుస్తుంది. ఇప్పటికే పలుమార్లు సినిమా వాయిదా పడింది. ఇటు ఫ్యాన్స్ కూడా సినిమా అవుట్ ఫుట్ బాగా వస్తే చాలు లేట్ అయినా పర్లేదు అని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా షూటింగ్ బాలన్స్ ఇంకా మిగిలి ఉందని, ముఖ్యంగా గ్రాఫిక్స్ కి సంబంధించిన పార్ట్ చాలా ఉందని వార్తలు వస్తున్నాయి. అందుకే ప్రభాస్ తదుపరి సినిమాలని ఇంకా సెట్స్ పైకి తేలేదు. ఇక మారుతి రాజా సాబ్ ఎప్పుడో స్టార్ట్ అయింది కాబట్టి ఆ సినిమా అప్పుడప్పుడూ షూట్ చేస్తున్నాడు.

రిలీజ్ డేట్ అయ్యేదాకా వెయిట్ చేస్తాడా?

అయితే ప్రభాస్ తన తర్వాతి సినిమా మారుతి తో చేస్తున్న రాజా సాబ్, ఆ తర్వాత వరుసగా సందీప్ తో స్పిరిట్, లేదా, ప్రశాంత్ నీల్ తో శౌర్యంగ పర్వం మొదలుపెడతాడు. అయితే అది ఆ దర్శకుల తదుపరి సినిమాలని బట్టి కూడా ఉంటుంది. అయితే వీరి తర్వాత ప్రభాస్ హనురాఘవపుడి తో సినిమా ఉంటుంది. ఇక ఈ కాంబోపై కూడా చాలా క్రేజీ అంచనాలున్నాయి. అయితే విరామం లేకుండా వరసపెట్టి సినిమాలు చేస్తోన్న పాన్ ఇండియా స్టార్ కొద్ది రోజులు సమ్మర్ బ్రేక్ తీసుకున్నాడు. కల్కి 2898AD (Kalki2898AD) రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యాక ప్రమోషన్స్ పూర్తి చేసుకుని RajaSaab సెట్స్ లో జాయిన్ అవుతాడు. అయితే ప్రభాస్ సన్నిహితుల దగ్గరి నుండి వచ్చిన సమాచారం ప్రకారం ప్రభాస్ కల్కి రిలీజ్ అయ్యేదాకా మారుతి సినిమా తప్ప కొత్త సినిమాలను స్టార్ట్ చేసే పరిస్థితి లేదని తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు