Vishwambhara : యాక్షన్ తప్ప ఇంకేమి లేదా?

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని పక్కా ప్లానింగ్ తో చేస్తున్న సినిమా ‘విశ్వంభర’. ఈ సినిమా ఇప్పుడు టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ మూవీ బింబిసార ఫేమ్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొన్ని నెలల కిందే మొదలైన ఏ సినిమా షూటింగ్ 2025 సంక్రాంతి రిలీజ్ నే టార్గెట్ గా పెట్టుకొని శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. అదే సమయంలో సినిమాకు సంబంధించిన ఎలాంటి విషయాలు బయటకి రాకుండా చూసుకుంటున్నారు మేకర్స్. ముఖ్యంగా సెట్స్ నుంచి చిరు లుక్ అండ్ గెటప్ ఇప్పటివరకు లీక్ అవ్వనివ్వలేదు. కానీ ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయకముందే, అనుకోకుండా చిరంజీవి లుక్ బయటకు వచ్చేసింది. తాజాగా తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనని అనుకోకుండా కలవడంతో షూటింగ్ నుండి జనసేన కార్యకర్తల ద్వారా చిరు లుక్ రివీల్ అయిపొయింది.

ఫాంటసీ జోనర్ లో..

అయితే చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమా పంచభూతాల కాన్సెప్ట్ తో రూపొందుతున్న సోషియో ఫాంటసీ అడ్వెంచర్ మూవీ గా ”విశ్వంభర” (Vishwambhara)ఉండబోతుంది. అయితే మూవీ నుండి ఇప్పటివరకు టైటిల్ గ్లింప్స్, మాత్రమే రిలీజ్ చేయగా, బిగ్ బాస్ ఎలాంటి గెటప్ లో కనిపిస్తారో అని ఫస్ట్ లుక్ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూడగా, పవన్ తో కలిసిన స్టిల్ రావడంతో, ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఉండే ఎగ్జైట్మెంట్ మెగా ఫ్యాన్స్ మిస్ అయ్యారని చెప్పొచ్చు. ఇక విశ్వంభర ని యువి క్రియేషన్స్ బ్యానర్ లో విక్రమ్, వంశీ, ప్రమోద్ కలిసి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతుందని సమాచారం. ఇందులో త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. సుర‌భి, ఈషా చావ్లా, ఆష్రిత వేముగంటి, ర‌మ్య ప‌సుపులేటి తదితరులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. లెజెండరీ సంగీత దర్శకులు ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.

యాక్షన్ సన్నివేశాల్లో విశ్వంభర..

ఇదిలా ఉండగా విశ్వంభర మొదలు షూటింగ్ మొదలు పెట్టడం తోనే యాక్షన్ సన్నివేశాలతో ప్రారంభించడం జరిగింది. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ నేతృత్వంలో పలు యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ మూడు నెలలకింద స్టార్ట్ కాగా, అప్పటి నుండి దాదాపు సినిమా 5 రకాల షెడ్యూల్స్ ని జరుపుకుంది. హైదరాబాద్ తో పాటు, వైజాగ్, ఊటీ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. కానీ ఈ సినిమా షెడ్యూల్ జరుపుకున్న ప్రతిసారి యాక్షన్ సన్నివేశాల్నే చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తుంది. మేకర్స్ కూడా పలుమార్లు యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఆఖరికి త్రిష తో కలిసి ఊటీలో తీసిన కీలక సన్నివేశాల్లో భాగంగా కూడా యాక్షన్ సీన్స్ తీసారట. తాజాగా హైదరాబాద్ లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో తాజాగా మొదలైన షెడ్యూల్ లో కూడా యాక్షన్ సీన్స్ తీస్తున్నట్టు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ షెడ్యూల్ గురించి చెప్తూ, విశ్వంభర విజృంభణం అని ఆంజనేయ స్వామి విగ్రహం ముందు కత్తులు ఎగరేసి షాట్ ని పెట్టడం జరిగింది. ఏది ఏమైనా ఈ సినిమా లో యాక్షన్ సీన్స్ మరీ ఎక్కువైతే కంటెంట్ దెబ్బతినే అవకాశం ఉందని మెగాఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం ముందు యాక్షన్ సీన్స్ షూట్ చేసి తర్వాత తీరిగ్గా డ్రామా సీన్లు, ఇతర టెక్నికల్ సీన్లపై దృష్టి పెడతారని అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు