Aishwarya Rajesh : స్టార్స్ కి కూడా డేట్లు ఇవ్వనంత బిజీ అయిన తెలుగమ్మాయి..

Aishwarya Rajesh : తెలుగు చిత్ర పరిశ్రమ లో తెలుగమ్మాయిలకు అవకాశాలు రావడమే చాలా అరుదు అని చాలా మంది భావిస్తుంటారు. 90స్ తర్వాత తెలుగు హీరోయిన్ల సంఖ్య చాలా తగ్గిపోయింది. ఇప్పుడున్న హీరోయిన్ల లో తెలుగమ్మాయిలని వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. అందుకు తగ్గట్టు తెలుగమ్మాయి ఒక్కరు కూడా చాలా ఏళ్ళ పాటు స్టార్ గా నిలబడ్డ సందర్భాలు కూడా లేవు. ఆ మధ్య అంజలి ఒక స్టార్ హీరోయిన్ గా మంచి పొజిషన్ కి వెళ్తుంది అనుకున్నా, స్టార్ హీరోల సినిమాల్లో పెద్దగా ఆఫర్లు రాలేదు. ఇక ఆ తర్వాత ఈ మధ్య కాలంలో అనన్య నాగళ్ళ, రూప కొదువాయుర్ లాంటి వాళ్ళు మంచి పొజిషన్ కి వస్తారనుకున్నా వాళ్ళు అంతగా పెర్ఫార్మ్ చేయట్లేదని తెలుస్తుంది. కానీ ఒక స్టార్ హీరోయిన్ అని అంజలి తరువాత తెలుగులో అంత నమ్మకాన్ని ఇచ్చిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. ఒకప్పటి తెలుగు హీరో రాజేష్ కుమార్తె అయిన ఈమె ముందుగా తమిళ్ లోనే పరిచయమవగా, అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక్కడంత లేదు గాని.. అక్కడ సూపర్ సక్సెస్..

ఇక తెలుగమ్మాయి అయిన ఐశ్వర్య రాజేష్ తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి సినిమా తో ఎంట్రీ ఇవ్వగా, ఆ సినిమాతో మంచి నటిగా గుర్తింపు వచ్చినా పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్, రిపబ్లిక్, టక్ జగదీశ్ లాంటి సినిమాలు చేయగా, పెర్ఫార్మన్స్ పరంగా మంచి రోల్స్ దొరికాయన్న సంతృప్తి తప్ప, హీరోయిన్ గా సక్సెస్ మాత్రం దక్కలేదు. ఇక ఈ సినిమాల తరువాత చేసిన ఐశ్వర్య మళ్ళీ తెలుగులో కనిపించలేదు. కానీ తమిళ్ లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ బిజీ అయింది. ఎంతలా అంటే తెలుగు ఇండస్ట్రీ సినిమాలకు డేట్లు ఇవ్వలేనంత. 2023 లో పదికి పైగా సినిమాల్లో నటించిన ఈ తెలుగమ్మాయి, ఈ ఇయర్ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ ఇయర్ కరుప్పర్ నగరం, మోహన్ దాస్, డియర్, ఇంకా మరో రెండు సినిమాలతో బిజీ గా ఉంది.

డియర్ తో ఆడియన్స్ ముందుకు..

ఇక ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) ఈ ఇయర్ లో ముందుగా డియర్ సినిమాతో ఆడియన్స్ ని పలకరించబోతుంది. ఈ సినిమాలో ఐశ్వర్యనే మెయిన్ లీడ్ గా నటించింది. ఐశ్వర్య రాజేష్, జివి ప్రకాష్ కుమార్ జంటగా నటించిన ఈ సినిమాలో ఐశ్వర్య గురక సమస్య ఉన్న అమ్మాయిగా నటించింది. కామెడీ, లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా తమిళ్ తో పాటు, తెలుగులో కూడా ఏప్రిల్ 11న రిలీజ్ కాబోతుంది. ఇక తెలుగులో ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతానికి ఏ సినిమాలు చెయ్యట్లేదు. ఇక తమిళ్ లో అయితే స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తుంది. అక్కడి తమిళ్ హీరోయిన్లు కూడా ఇంత బిజీగా లేరని చెప్పాలి. ఏది ఏమైనా తెలుగు నిర్మాతలు పెద్దగా పట్టించుకోకపోయినా, తమిళ్ లో మాత్రం ఐశ్వర్య రాజేష్ ఏలేస్తుందని చెప్పాలి. మరి టాలీవుడ్ మేకర్స్ కి తెలుగమ్మాయిల టాలెంట్ ఎప్పుడు కనిపిస్తుందో.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు