Aishwarya Rajesh: ఇక్కడ పట్టించుకోవట్లేదు గాని.. అక్కడ ఏలేస్తుంది..!

టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్ల కు ఛాన్సులు రావన్న రూమర్స్ ఎప్పట్నించో ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టు తెలుగమ్మాయి ఒక్కరు కూడా చాలా ఏళ్ళ పాటు స్టార్ గా నిలబడ్డ సందర్భాలు కూడా లేవు. ఆ మధ్య అంజలి ఒక స్టార్ హీరోయిన్ గా మంచి పొజిషన్ కి వెళ్తుంది అనుకున్నా, స్టార్ హీరోల సినిమాల్లో పెద్దగా ఆఫర్లు రాలేదు. ఇక ఆమె తరువాత తెలుగులో అంత నమ్మకాన్ని ఇచ్చిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్.

ఒకప్పటి తెలుగు హీరో రాజేష్ కుమార్తె అయిన ఈమె ముందుగా తమిళ్ లోనే పరిచయమవగా, అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తరువాత తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి తో ఎంట్రీ ఇవ్వగా, అక్కడితోనే మంచి నటిగా గుర్తింపు వచ్చిన పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్, రిపబ్లిక్, టక్ జగదీశ్ సినిమాలు చేసిన ఐశ్వర్య మళ్ళీ
తెలుగులో కనిపించలేదు. కానీ తమిళ్ లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ బిజీ అయింది.

ఎంతలా అంటే వేరే ఇండస్ట్రీ సినిమాలకు డేట్లు ఇవ్వలేనంత.. 2023 లో పదికి పైగా సినిమాల్లో నటించిన ఈ తెలుగమ్మాయి, అన్ని తమిళ సినిమాలే కాగా, అందులో ఆరు రిలీజ్ అవగా, మరో నాలుగు 2024 లో రిలీజ్ అవుతున్నాయి. ఇవేగాక మరో రెండు వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఏది ఏమైనా తెలుగు నిర్మాతలు పెద్దగా పట్టించుకోకపోయినా తమిళ్ లో మాత్రం ఐశ్వర్య రాజేష్ ఏలేస్తుందని చెప్పాలి. మరి తెలుగు మేకర్స్ కి తెలుగమ్మాయిల టాలెంట్ ఎప్పుడు కనిపిస్తుందో.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు