Kiraak RP: స్టార్స్ ని వాడుకుంటున్న జబర్దస్త్ కమెడియన్.. అందుకే ఇలా..!

సాధారణంగా ఎవరైనా తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవడానికి సెలబ్రిటీలను ఆశ్రయిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. సెలబ్రిటీలు అయితే తమ ఉత్పత్తులను నేరుగా ప్రజలలోకి తీసుకెళ్తారన్న కారణంతోనే ఇలా వారిని తమ బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్ మాత్రం ఏకంగా స్టార్స్ కి తాను చేసిన వంట రుచి చూపించడమే కాదు పరోక్షంగా వారిని వాడుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీం లీడర్ గా జబర్దస్త్ లో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన.. తన గురువు నాగబాబు.. షో నుంచి వెళ్లిపోవడంతో అదే బాటలో కిరాక్ ఆర్పీ కూడా షో నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత మల్లెమాల సంస్థ మీద విమర్శల దాడి చేశారు. కమెడియన్స్ శ్రమ దోచుకుంటున్నారని.. కనీసం మంచి భోజనం కూడా పెట్టలేదంటూ వారిపై ఫైర్ అయ్యారు.

జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక దర్శకుడిగా మారే ప్రయత్నం చేశారు. అయితే ఒక మూవీ లాంచ్ చేసి మధ్యలోనే వదిలేశారు. ఇప్పుడు వ్యాపారస్తులుగా మారారు. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనే పేరుతో కూకట్పల్లి సమీపంలో కర్రీ పాయింట్ ఓపెన్ చేసిన వ్యాపారంతో భారీ లాభాలను అందుకున్నారు..అతి కొద్ది రోజుల్లోనే హైదరాబాదులో మణికొండలో మరో బ్రాంచ్ ఏర్పాటు చేసి ఆంధ్రాకి కూడా విస్తరించారు. తిరుపతిలో కూడా ఒక బ్రాండ్ ఏర్పాటు చేయగా.. దీని లాంచింగ్ కి మంత్రి రోజాతో పాటు ప్రముఖ హీరోయిన్ మెహ్రీన్ కూడా రావడం ఆశ్చర్యం.

- Advertisement -

ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా తన చేపల పులుసును గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పంపినట్లు కిరాక్ ఆర్పీ వెల్లడించారు. అలాగే దర్శకుడు బోయపాటి శ్రీనుకి కూడా పంపారట. ఇక ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఇది విన్న నెటిజెన్స్ కిరాక్ ఆర్పీ మాములోడు కాదు తన బ్రాండ్ ప్రమోట్ చేస్తారన్న ఉద్దేశంతో లేక ఫీడ్బ్యాక్ తెలియజేస్తారనే చేపల పులుసు పంపించి ఉంటారు అంటూ కామెంట్లు చేయగా.. దీనిపై ఆయన స్పందిస్తూ.. కేవలం వాళ్ల నుండి మరలా చేపలు పులుసు కావాలని ఫోన్ రావాలి.. అందుకే సెలబ్రిటీలకు చేపల పులుసు పంపించాను అంటూ వెల్లడించారు ప్రస్తుతం ఈ బిజినెస్ లో కోట్లు గడిస్తున్నారు కిరాక్ ఆర్పి. చేపల పులుసు ధర ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా దీని రుచి చూడడానికి జనాలు ఎగబడుతున్నారు అనడంలో సందేహం లేదు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు