Dunki: ‘సలారోడి’ దెబ్బపడ్డా.. నిలబడ్డాడు..అయినా?

బాలీవుడ్ లో 2023 లో షారుఖ్ నామ సంవత్సరంగానే చెప్పుకుంటారు. ఎందుకంటే ఆ ఇయర్ రిలీజ్ అయిన పఠాన్, జవాన్ రెండు సినిమాలు కూడా 1000 కోట్ల వసూళ్లు సాధించి కింగ్ ఖాన్ కి చాలా ఏళ్ళ తర్వాత మాస్ బూస్ట్ ని ఇచ్చింది. ఇక 2023 లో ఫినిషింగ్ టచ్ కూడా తానే ఇవ్వాలని అనుకున్నాడు. అందుకే క్లాసిక్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో డుంకి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడే రిలీజ్ డేట్ ని డిసెంబర్ 21 అని ప్రకటించగా, అనూహ్యంగా ఆ తరువాతి రోజు రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘సలార్’ కూడా రిలీజ్ అయింది.

అయితే పోటీ అయినా సరే షారుఖ్ తమ సినిమా తమదే అంటూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పోటీగా రిలీజ్ చేసారు. అయితే రిలీజ్ తర్వాత అందరూ ఊహించినట్టే సలార్ మూవీకే భారీ ఓపెనింగ్స్, కలెక్షన్లు వచ్చాయి. ఇక డుంకి కి డీసెంట్ టాక్ వచ్చినా కూడా ఓపెనింగ్స్ మాత్రం చాలా దారుణంగా వచ్చాయి. అయితే అనూహ్యంగా లాంగ్ రన్ లో పుంజుకోవడం ప్రారంభించింది. ఇండియా వరకు డుంకి యావరేజ్ వసూళ్లే సాధించినా ఓవర్సీస్ లో డుంకి భారీ కలెక్షన్లు సాధించింది.

తాజాగా డుంకి రెండు వారాల రన్ ని పూర్తి చేసుకోగా, వరల్డ్ వైడ్ గా 417 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక డుంకి కి అయిన ప్రీ రిలీజ్ బిజినెస్ లో ఇండియా లో కొన్ని ఏరియాల్లో ఇంకా లాభాలు రాకపోయినా, వరల్డ్ వైడ్ గా అయితే ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా వచ్చేసింది అని టాక్. మరో 10 నుండి 15 కోట్లు రాబడితే డుంకి హిట్ స్టేటస్ ని అందుకోవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఇక మూడో వీకెండ్ లో ఆ ఫీట్ ని డుంకి అందుకునేలా ఉంది. ఏది ఏమైనా సలారోడు దెబ్బతీసినా, ఓవర్సీస్ సాయంతో నిలబడ్డాడని చెప్పొచ్చు.

- Advertisement -

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos,and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు