BreakingNews : ‘ఈగల్’ వాయిదా.. ఇట్స్ ఆఫీషియల్..

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి అయిదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయని ఇప్పటివరకు అనుకున్న సంగతి తెలిసిందే. ఈ అయిదు సినిమాలు వేటికవే ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకోగా, ఎవరికీ వారు పోటీగా తమ సినిమాలను ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. అయితే థియేటర్ల సమస్య వస్తుందని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎవరో ఒకరు తమ సినిమాని వాయిదా వేసుకోమని చెప్పినా తగ్గలేదు. ఫైనల్ గా దిల్ రాజు ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్ లో ఓ పెద్ద సినిమాని మేకర్స్ తో మాట్లాడి వాయిదా వేయించడం జరిగింది.

ఆ సినిమా ఇంకేదో కాదు.. అందరూ అనుకున్నట్టే రవితేజ నటించిన “ఈగల్” మూవీ. అయితే ఈ మూవీ వాయిదా పడిందని రెండు మూడు రోజుల నుండి వార్తలు వస్తున్నా, ఎవ్వరూ నమ్మలేదు.. పైగా మేకర్స్ కూడా వాయిదా వేసే ప్రసక్తి లేదని అన్నారు. కానీ తాజాగా దిల్ రాజు ఆధ్వర్యంలో నిర్మాతల మండలి పెట్టిన ప్రెస్ మీట్ లో అఫిషియల్ గా ఈగల్ వాయిదా ని కంఫర్మ్ చేయడం జరిగింది.

ఆ ప్రెస్ మీట్ లో దిల్ రాజు మాట్లాడుతూ 15 రోజుల క్రితం నిర్మాతలతో మీటింగ్ పెట్టి చర్చించాం.. గ్రౌండ్ రియాలిటి వివరించాం. ప్రతి ఏడాది ఉండే ఇబ్బందే ఇప్పుడు కూడా వచ్చిందని, అయితే ఫైనల్ గా ఈగల్ సినిమా వెనక్కి వెళ్లేందుకు నిర్మాత అంగీకరించారని, దీనికి సహకరించిన ఈగల్ నిర్మాతలు విశ్వ ప్రసాద్ కి, వివేక్ కూచిబొట్ల, ఇంకా రవితేజ గారికి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నామని దిల్ రాజు చెప్పడం జరిగింది.

- Advertisement -

ఇక ఫైనల్ గా ఈగల్ సంక్రాంతి రేసు నుండి తప్పుకోగా, కొత్త రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించడం జరిగింది. ఈగల్ ని ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేయగా, నిర్మాతల మండలి కూడా ఒప్పుకోగా, యాత్ర2, టిల్లు2 నిర్మాతలతో మాట్లాడి థియేటర్లు సర్దుబాటు చేస్తామని దిల్ రాజు చెప్పడం జరిగింది. ఓవరాల్ గా దిల్ రాజు ఎన్నో సార్లు ప్రయత్నించి ఫైనల్ గా అనుకున్నది సాధించాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు