Raviteja: ఈగల్ ఎగిరిపోతుంది… ఎప్పుడు వాలుతుందో తెలుసా?

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల్లో నలుగురు స్టార్ హీరోల సినిమాలు, ఒక మీడియం రేంజ్ మూవీ రిలీజ్ అవుతున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ పండక్కి అన్ని సినిమాల మీద మంచి అంచనాలు క్రియేట్ అవగా, దేనికవే ప్రమోషన్లలో పోటీ పడుతూ జనాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే లేటెస్ట్ గా సోషల్ మీడియాలో సంక్రాంతి బరి నుండి ఓ పెద్ద సినిమా తప్పుకుందని సమాచారం. ఆ సినిమా ఇంకెవరిదొ కాదు మాస్ మహారాజ్ రవితేజ నటించిన “ఈగల్” సినిమాయే.

అయితే ఈ సినిమా వాయిదా పడుతుందని ఆడియన్స్ కూడా ముందే ఊహించారు. ఎందుకంటే సంక్రాంతి సినిమాల్లో అన్నిటికంటే లేట్ గా షూట్ స్టార్ట్ అయ్యింది ఈగిలే. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి ఉండదని జనాలు అభిప్రాయపడ్డారు. అయితే వాయిదా వేయడానికి కారణం మాత్రం ఇది కాదు. సంక్రాంతి కి వస్తున్న సినిమాల్లో అన్ని క్రేజీ అంచనాలున్న సినిమాలే కాగా, వాటిలో ఏ సినిమా కూడా వెనక్కి తగ్గడం లేదు. పైగా థియేటర్లు మాత్రం న్యాయంగా, ఆ సినిమాలకు తగ్గ రేంజ్ లో పంచాలి. దీని వల్ల ‘ఈగల్’ సినిమాకు థియేటర్ల సమస్య ఏర్పడిందట.

ఎందుకంటే ఈగల్ సినిమాకి అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ కాగా, బిజినెస్ కూడా వాళ్ళు అనుకున్నంత రేంజ్ లో కాలేదు. పైగా ఈగల్ కి జరిగిన బిజినెస్ కి బ్రేక్ ఈవెన్ కావాలంటే ఈ థియేటర్లు సరిపోవని మేకర్స్ భావించారట. అందుకే సినిమా వాయిదా వేయాలని అనుకున్నారట. అయితే అదే పనిలో పనిగా ఫ్యాన్స్ ని డిస్సపాయింట్ చేయకుండా, కొత్త రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేసే ప్లానింగ్ లో ఉన్నారట

- Advertisement -

ఆ రిలీజ్ డేట్ సంక్రాంతి కంటే బెస్ట్ ఆప్షన్ గా మారనుందని అంటున్నారు. ఆ డేట్ మరేదో కాదు జనవరి 26. ఆ రోజున రిపబ్లిక్ డే హాలిడే కావడం, అందులోనూ మాస్ మహారాజ్ రవితేజ బర్త్ డే కావడం కూడా కలిసొచ్చే అంశం. పైగా అప్పుడు సోలో రిలీజ్ దక్కుతుంది కాబట్టి మాస్ రాజా ఫ్యాన్స్ కి మాస్ జాతరే అని, ఆరోజు మంచిదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయం నిజమే అయితే దీనిపై ఆడియన్స్ కి మూవీ మేకర్స్ క్లారిటీ ఇవ్వాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు