Dussehra Movie Villain: దసరా విలన్ పెళ్లి చేసుకోబోతున్న ఈ బ్యూటీ బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే నోరెళ్లబెడతారు….!!

మలయాళ నటుడు షైన్ టామ్ చాకో అంటే తెలుగు సినీ ప్రియులకు వెంటనే గుర్తుకు రాకపోవచ్చు.. కానీ దసరా సినిమా విలన్ అంటే మాత్రం ఠక్కున గుర్తొస్తారు చాకో. ఈయన మాలీవుడ్ లో మంచి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు. దసరా సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు షైన్ టామ్ చాకో. దసరా మూవీలో నానికి ధీటుగా తన నటన అద్భుతం అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ తో దేవర సినిమాలో ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు చాకో.

ప్రస్తుతం 40 ఏళ్ల వయసులో ఉన్న షైన్ టామ్ చాకో అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పుకొచ్చారు. తాజాగా తన గర్ల్ ఫ్రెండ్ తో నిశ్చితార్థం చేసుకున్నాడు ఈ దసరా విలన్. చాలా రోజుల నుండి ఓ అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడు. ఈ విషయమై కొన్నాళ్లుగా జంటగా ఫోటోలు కూడా వైరల్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు తమ బంధం గురించి వస్తున్న పుకార్లకు తెరదించాడు ఈ విలన్. మరో ఒకటి, రెండు నెలల్లో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు.

అయితే షైన్ టామ్ చాకో కి ఇప్పటికే పెళ్లి జరిగినట్లు వికీపీడియాలో ఉంది. తబీబా అనే మహిళతో పెళ్లి అయ్యిందని.. వీళ్లకు ఓ బిడ్డ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం తనూజ అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు షైన్ టామ్ చాకో. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. దీంతో జంట చూడముచ్చటగా ఉందంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు తనుజ బ్యాగ్రౌండ్ చాలా పెద్దది. ఆమె గోల్డ్ మెడలిస్ట్ అని తెలుస్తోంది.

- Advertisement -

 

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు