Naa Saami Ranga: కూతురి వయసున్న అమ్మాయితో రొమాన్స్

సినీ ప్రపంచంలో జరిగే వింతలు మరెక్కడా జరగవేమో అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. సీనియర్ హీరోలు తమ కంటే వయసులో చాలా చిన్న హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకోవడం కూడా అందులో ఒకటి. దాదాపు వాళ్ల వయసులో సగం ఏజ్ ఉన్న హీరోయిన్లతో సీనియర్ హీరోలు రొమాన్స్ చేయడం విచిత్రంగా అనిపిస్తుంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాను జనాలు ఎక్కువగా వినియోగిస్తూ ఉండడంతో ఇలాంటి విషయాలను భూతద్దం పెట్టి మరీ చూస్తున్నారు. ఏజ్ లో తమ కూతురు వయసు ఉండే హీరోయిన్లతో సినిమాలు చేస్తున్న సీనియర్ హీరోలపై దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఇదివరకు చిరంజీవి, బాలయ్య వంటి వారిపై ఇలాంటి ట్రోల్ నడిచింది. ఇప్పుడు మరో సీనియర్ హీరో నాగార్జున వంతు వచ్చింది.

ఈ సంక్రాంతికి నాగార్జున “నా సామి రంగ” అనే విలేజ్ మాస్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీలో నటిస్తున్న హీరోయిన్ ఆషిక రంగనాథ్ హీరో నాగార్జున కంటే 37 ఏళ్లు చిన్నది కావడం ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ కన్నడ భామ ఆషిక రంగనాథ్ వయసు 27 ఏళ్లు. నాగార్జున వయసు 64 ఏళ్లు. దీంతో కూతురి వయసు ఉన్న అమ్మాయితో నాగ్ రొమాన్స్ చేయడం ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇండస్ట్రీలో ఎంతోమంది సీనియర్ హీరోయిన్లు ఉండగా ఈ హీరోలు ఎందుకు కూతురు వయసున్న అమ్మాయిలను హీరోయిన్లుగా ఎంచుకుంటున్నారు? అనే చర్చ మరోసారి మొదలైంది. మరి మన హీరోలకు వాళ్ళ వయసుకు తగ్గ హీరోయిన్లు దొరకట్లేదా? లేక అలాంటి స్క్రిప్టులే వీళ్ళ దగ్గరకు రావట్లేదా? ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోయిన్లను వదిలేసి ఎవరో ఒక కొత్త హీరోయిన్ తో, అది కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి ఇంత తక్కువ ఏజ్ ఉన్న అమ్మాయిని హీరోయిన్ గా తీసుకుని “నా సామి రంగ” మూవీని చేయడంతో నాగార్జునపై, అలాగే మూవీ టీంపై విమర్శలు వస్తున్నాయి.

ఇక రీసెంట్ వచ్చిన “ధమాకా” మూవీ విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఆ మూవీలో రవితేజతో కూతురు వయసున్న శ్రీలీల హీరోయిన్ గా నటించడం విమర్శలకు దారి తీసింది. కానీ “ధమాకా” మూవీ సూపర్ హిట్ కావడం కంటెంట్ ఉండాలి గాని వయసుతో పనేంటి? అనిపించేలా చేసింది. ఇక ఇక్కడ కీలకమైన అంశం ఏమిటంటే డైరెక్టర్ హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్లను ఆకర్షణీయమైన స్క్రీన్ ప్లేతో రూపొందిస్తే వాళ్ల మధ్య ఉండే ఏజ్ గ్యాప్ అనేది ప్రేక్షకులను పెద్దగా ఇబ్బంది పెట్టదు. మరి ఈ అంశం పరంగా చూసుకుంటే “నా సామి రంగ” మూవీ సక్సెస్ అవుతుందా లేదా ? అన్న విషయం డైరెక్టర్ విజయ్ బిన్నీ చేతిలో ఉంటుంది. ఆయన గనక ఆకర్షణీయమైన కథనాన్ని అల్లి, నాగార్జున, ఆషిక క్యారెక్టర్ లను ఆసక్తికరంగా వెండితెరపై చూపించగలిగితే ఈ వయసు సమస్యను పక్కన పెట్టి ప్రేక్షకులు సినిమాను ఆదరించే అవకాశం ఉంటుంది. కాగా “నా సామి రంగ” మూవీ జనవరి 14న సంక్రాంతి కానుకగా రాబోతోంది.

- Advertisement -

 

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు