Hanuman Producer: “గుంటూరు కారం”కు అంత సీన్ లేదు

Hanuman Producer: ఈ సంక్రాంతికి “గుంటూరు కారం”, “హనుమాన్” సినిమాల మధ్య బిగ్గెస్ట్ క్లాష్ జరగబోతున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న “గుంటూరు కారం” మూవీ, తేజ సజ్జ హీరోగా నటిస్తున్న సూపర్ హీరో మూవీ “హనుమాన్” జనవరి 12న రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి. అయితే “గుంటూరు కారం” టీం ఇప్పటికే అన్ని థియేటర్లను ఆక్రమించేసింది. “హనుమాన్” మూవీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుండగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ మూవీకి అతి తక్కువ థియేటర్లు అందుబాటులో ఉన్నాయి.

ప్రస్తుతం “హనుమాన్” మూవీకి థియేటర్ల విషయంలో అన్యాయం జరిగింది అంటూ సోషల్ మీడియాలో ఒకవైపు చర్చ నడుస్తుండగా, మరోవైపు “హనుమాన్” నిర్మాత నిరంజన్ రెడ్డి “గుంటూరు కారం” మూవీపై తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. “గుంటూరు కారం” మూవీకి అంత సీన్ లేదు, బుక్ మై షోనే అందుకు సాక్ష్యం అనిపించేలా కామెంట్స్ చేశారు నిరంజన్ రెడ్డి. ఇంతకీ ఆయన ఏమన్నారు అంటే…

తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ “గుంటూరు కారం మూవీ కంటే మా హనుమాన్ సినిమా పైనే జనాల ఫోకస్ ఉంది. బుక్ మై షో లో ఇంట్రెస్ట్ లు చూశారు కదా” అంటూ ఆయన మనసులో ఉన్న మాటను బయటకు చెప్పేశారు. బుక్ మై షోలో చూస్తే “గుంటూరు కారం” మూవీ కంటే “హనుమాన్’ మూవీపైనే ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇక “బేబీ సినిమా 8 వీక్స్ లాంగ్ రన్ పడింది. మా హనుమాన్ మూవీ కూడా 8, 9 వారాలు లాంగ్ రన్ కచ్చితంగా ఉంటుంది.

- Advertisement -

మా టార్గెట్ కూడా అదే. రెండు మూడు రోజులు ఇబ్బంది పడతాం ఏమో కానీ మేము లాంగ్ రన్ కోసమే చూస్తున్నాం” అంటూ “గుంటూరు కారం” మూవీతో క్లాష్ వల్ల తమ సినిమాపై పెద్దగా ఎఫెక్ట్ ఏం ఉండదు అనే విషయాన్ని ఇన్ డైరెక్ట్ గా చెప్పేశారు. హనుమాన్ మూవీ బడ్జెట్ గురించి మాట్లాడుతూ ఈ మూవీకి ముందుగా అనుకున్న బడ్జెట్ ఒకటైతే, ఆ తర్వాత ఐదారు రేట్లు పెరిగింది అంటూ చెప్పుకొచ్చారు.

సినిమా రిలీజ్ డేట్ గురించి నిర్మాత నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ “దిల్ రాజు “హనుమాన్” మూవీ 11న కానీ 14న గాని వస్తే బాగుంటుందని అన్నారు. కానీ మా బిజినెస్ పరంగా చూసుకుంటే మేము అలా పోస్ట్ పోన్ లేదా ప్రీ పోన్ చేయలేము. జనవరి 12న రావాలి” అని చెప్పి జనవరి 12నే “గుంటూరు కారం” మూవీకి పోటీగా ఎందుకు రావాలి అనుకుంటున్నారు అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా ఈ ఇంటర్వ్యూలోనే నిర్మాత నిరంజన్ రెడ్డి థియేటర్ల సమస్యపై కూడా మాట్లాడారు.

“నైజాంలో ఉన్న 76 సింగిల్ స్క్రీన్స్ లో 10 నుంచి 15 స్క్రీన్స్ “హనుమాన్” మూవీకి ఇవ్వమని అడుగుతున్నాము. మరి ఇస్తారో లేదో చూడాలి” అంటూ కనీసం ఆమాత్రం అయినా థియేటర్లు వస్తే బాగుంటుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కానీ మరోవైపు “గుంటూరు కారం” నిర్మాత నాగ వంశీ మాత్రం ఉన్న అన్ని థియేటర్లలో తన మూవీనే రిలీజ్ చేయాలని ఆలోచనలో ఉన్నారు. మరి ఈ సంక్రాంతికి ఏ మూవీకి ఎన్ని థియేటర్లు కేటాయించబోతున్నారు అనే విషయం త్వరలోనే తేలిపోతుంది.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు