Anandi: భర్తపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

సాధారణంగా హీరోయిన్లు పెళ్లయిన తర్వాత సినిమాల్లో నటించడం మానేస్తారు. ఒకవేళ నటించే ఇంట్రెస్ట్ ఉన్నా రొమాంటిక్ సీన్లకు దూరంగా ఉంటారు. కానీ తాజాగా హీరోయిన్ ఆనంది మాత్రం పెళ్లయిన తర్వాతే బోల్డ్ సీన్స్ చేయడమే కాకుండా, తన భర్త అలాంటి సన్నివేశాల్లో నటించమన్నాడు అంటూ చెప్పుకొచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. ఇంతకీ ఆనంది బోల్డ్ సీన్స్ చేస్తున్న ఆ మూవీ ఏంటి? ఆమె భర్త అలాంటి సీన్స్ లో ఎందుకు నటించమన్నాడు? అనే విషయంలోకి వెళ్తే…

తమిళ సినిమాలతో పాపులర్ అయిన తెలుగు అమ్మాయి ఆనంది. టాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటించిన ఆనందికి ఇక్కడి కంటే కోలీవుడ్ లోనే మంచి క్రేజ్ ఉంది. తెలంగాణలోని వరంగల్ జిల్లా ఆనంది స్వస్థలం కాగా, అవకాశాల కోసం ఈ బ్యూటీ కోలీవుడ్ కు వెళ్లడం, అక్కడ మంచి ఛాన్సులు వచ్చి పాపులారిటీ పెరగడంతో తమిళంలోనే హీరోయిన్ గా నిలదొక్కుకుంది. ఈ బ్యూటీ అసలు పేరు రక్షిత కాగా, సినిమాల్లోకి వచ్చిన తర్వాత హాసికగా మార్చుకుంది. కానీ అది కూడా కలిసి రావడంతో ఆనంది అని కొత్త పేరు పెట్టుకుంది. ఇక 2021లో తమిళ కో డైరెక్టర్ సోక్రటీస్ ని పెళ్లి చేసుకుంది ఈ అమ్మడు. తెలుగులో ఆనంది జాంబిరెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్, ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం వంటి మంచి సినిమాల్లో నటించింది. దీంతో టాలీవుడ్ లో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది ఆనంది. ఇక ఆనంది అనగానే సాంప్రదాయ లుక్ లో ఉండే అందమైన హోమ్లీ అమ్మాయి గుర్తొస్తుంది మనకు. కానీ ఇప్పుడు తను తాజాగా నటిస్తున్న సినిమాతో ఆ ఇమేజ్ ను చేరిపేసుకోవడానికి రెడీ అయింది ఆనంది. దానికి కారణం ఆమె భర్తేనట.

ప్రస్తుతం ఆనంది “మంగై” అనే తమిళ సినిమా చేస్తోంది. మున్నార్ నుంచి చెన్నైకి ఒంటరిగా ప్రయాణం చేస్తున్న పడుచు అమ్మాయి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది అనేదే ఈ సినిమా కథ. అయితే మొదటగా మేకర్స్ ఈ స్టోరీతో తన దగ్గరకు రాగానే పెళ్లయిపోయింది కాబట్టి ఇప్పుడు తాను అలాంటివి చేయడానికి సిద్ధంగా లేను అని చెప్పి రిజెక్ట్ చేసిందట. కానీ ఆమె భర్త మాత్రం ఈ సినిమా చేయమని ప్రోత్సహించారట. ఒకవేళ ఆ పాత్రకు అవసరమైతే నిర్భయంగా బోల్డ్ సీన్స్ చేయమని తన భర్త స్వయంగా చెప్పడంతో ఈ సినిమాను చేయడానికి అంగీకరించిందట ఆనంది. కేవలం ఒక నటి లాగా ఆలోచించమని చెప్పడంతో తన భర్త ప్రోత్సాహం వల్లే ఆ బోల్డ్ సన్నివేశాల్లో కంఫర్ట్ గా నటించాను అనే విషయాన్ని తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో వెల్లడించింది ఆనంది. ఎప్పుడూ హోమ్లీగా కనిపించే ఆనంది ఈ మూవీలో బోల్డ్ రోల్స్ చేసి తాను కూడా గ్లామర్ బ్యూటీనే అని ప్రూవ్ చేసుకోబోతోంది అన్నమాట.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు