Eagle : మొండి మోతుబరి విధ్వంసానికి సెన్సారోళ్లే అడ్డం రాలేదు..

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి రాబోతున్న సినిమాల్లో మాస్ మహారాజ్ రవితేజ నటించిన “ఈగల్” కూడా ఒకటి. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించగా కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసాడు. ఇక ఈ సినిమాను పీపుల్స్ మీడియా బ్యానర్ లో వివేక్ కూచిబొట్ల, టిజి విశ్వ ప్రసాద్ నిర్మించారు. ఇక సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో దేనికవే డిఫరెంట్ జోనర్ లో వస్తుండగా, ఈగల్ తో తాము కూడా ఒక డిఫరెంట్ మాస్ ఆక్షన్ సబ్జెక్ట్ తో వస్తున్నామని మేకర్స్ చెప్పడం జరిగింది.

ఇదిలా ఉండగా ఈ సినిమాపై వచ్చిన టీజర్, ట్రైలర్స్ కూడా ఆకట్టుకోగా, చిత్ర యూనిట్ ప్రమోషన్ల లో ఊపు పెంచారు. హీరోహీరోయిన్లతో వరుస ఇంటర్వ్యూ లు ఇప్పిస్తూనే మిగతా కార్యక్రమాలని కూడా ఫినిష్ చేసారు. ఇక తాజాగా ఈగల్ సినిమాను సెన్సార్ కి కూడా పంపగా, అక్కడ ఈగల్ కి తిరుగులేకుండా పోయింది. ఈగల్ సినిమాకు కట్ కూడా లేకుండా U/A సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. ఇది మాస్ రాజా ఫ్యాన్స్ కి మంచి విశేషమని చెప్పాలి.

ఇక సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో ఇప్పటికే హనుమాన్ సినిమా కూడా సెన్సార్ సర్టిఫికెట్ పొందగా, మిగతా సినిమాలు కూడా ఆ పనిని ముగించుకుంటున్నాయి. ఇక ఈగల్ సినిమా జనవరి 13న రిలీజ్ అవుతుండగా, అదే రోజు వెంకటేష్ సైన్ధవ్ కూడా రిలీజ్ అవుతుంది. దానికి ముందు రోజు జనవరి12న హనుమాన్, గుంటూరు కారం రిలీజ్ అవుతుండగా, జనవరి 14న నా సామి రంగ రిలీజ్ అవుతుంది.

- Advertisement -

For More Updates : Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు