Eagle: పొంగల్‌కి పక్కా అంటున్న మేకర్స్.. అయినా నమ్మరే?

టాలీవుడ్ లో రాబోయే సంక్రాంతి సీజన్ చాలా టఫ్ గా ఉండబోతుందన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఈ సారి ఐదు సినిమాలు సంక్రాంతి రేసులో ఉన్నాయి. వీటిలో ఏ సినిమా ఖచ్చితంగా అనుకున్న టైం కి వస్తుందో చెప్పలేని పరిస్థితి ఉంది. ఇక ఉన్న సినిమాలకే థియేటర్లు లేవురా అనే డబ్బింగ్ సినిమాలు కూడా పొంగల్ కి వస్తాము అంటున్నాయి. అయితే తెలుగు సినిమాల పరిస్థితి విషయానికి వస్తే ఇప్పటివరకు గుంటూరు కారం, సైంధవ్‌ మూవీస్ మాత్రమే అఫిషియల్ గా రిలీజ్ డేట్స్ కంఫర్మ్ చేసుకున్నాయి.

ఇక మిగతా సినిమాల్లో హనుమాన్, నా సామి రంగ సినిమాలు రిలీజ్ డేట్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదంటూ ఆల్మోస్ట్ రావడం కంఫర్మ్ అంటూ ఎవరికీ వారు ప్రమోషన్లు చేసుకుంటున్నారు. ఇక పొంగల్ బరిలో ఉన్న మరో సినిమా మాస్ మహారాజ్ రవితేజ నటించిన “ఈగల్”.

ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ చాలా రోజుల నుండే చెప్తూ వస్తున్నారు. పైగా మూవీ పై ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ప్రమోషన్లతో హైప్ పెంచుతూనే ఉన్నారు. కానీ సోషల్ మీడియా లో మాత్రం ఈగల్ పోస్ట్ పోన్ అవుతుందని చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయంపై చిత్ర యూనిట్ పలుమార్లు క్లారిటీ ఇవ్వడం జరిగింది. తాజాగా మళ్ళీ క్లారిటీ ఇస్తూ ఓ ఫ్యాన్ పేజ్ ని రీట్వీట్ చేస్తూ తాము ఖచ్చితంగా పొంగల్ కి వస్తున్నామంటూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు ప్రకటించారు. మరి ఈగల్ సినిమా రిలీజ్ పై పక్కాగా క్లారిటీ రావాలంటే మరో ట్రైలర్ వస్తే గాని చెప్పలేమేమో?

- Advertisement -

For More Updates : Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు