Amala Paul: వివాహమై రెండు నెలలు కూడా కాలేదు.. అప్పుడే గుడ్ న్యూస్..!!

Amala Paul: టాలీవుడ్ , బాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మైనా అనే చిత్రం ద్వారా మొదటిసారి తన కెరీర్ ని మొదలుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. తన ఫస్ట్ చిత్రానికే జాతీయ అవార్డును కూడా అందుకుంది.. ఆ సినిమా తర్వాత తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం వంటి భాషలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. అలా కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే తమిళ డైరెక్టర్ AL విజయ్ ను ప్రేమించి మరీ వివాహం చేసుకున్న ఈమె.. కొద్ది రోజులకే విభేదాలు రావడంతో విడాకులు తీసుకోవడం జరిగింది.

ఆ తర్వాత డైరెక్టర్ విజయ్ వేరే అమ్మాయిని వివాహం చేసుకోగా.. అమలాపాల్ మాత్రం కొద్దిరోజులు ఒకరితో ప్రేమలో ఉండి.. అతడిని పెళ్లి చేసుకుంటుంది అనుకునే సమయంలో అతని పైన చీటింగ్ కేసు పెట్టి పోలీసులకు అప్పగించింది.. అయితే ఆ తర్వాత ఎన్నో వెబ్ సిరీస్లలో, సినిమాలలో నిర్మాతగా మారి తన కెరీర్ ని మళ్లీ మొదలుపెట్టిన అమలాపాల్ గత ఏడాది జగత్ దేశాయ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది.

జూన్ నెల నుంచి డేటింగ్ లో ఉన్న ఈ జంట నవంబర్లో వివాహం చేసుకోగా వీరికి పెళ్లి అయి రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే అభిమానులకు ఒక గుడ్ న్యూస్ తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే మేము ముగ్గురం కాబోతున్నామంటూ ఒక పోస్ట్ ని షేర్ చేసింది. దీనితో అమలాపాల్ తల్లి కాబోతుందని తెలియడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు.. అదేమిటి మీకు పెళ్లయి ఇంకా రెండు నెలలు మాత్రమే అయ్యింది కదా అప్పుడే మూడో నెల ఏంటి అంటూ కొంతమంది నేటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.

- Advertisement -

ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు కూడా ప్రెగ్నెంట్ అయ్యాకనే వివాహం చేసుకోవడానికి మక్కువ చూపుతున్నారు. అలా చాలామంది సెలబ్రిటీలు కూడా వివాహం చేసుకోవడం జరిగింది. ఏది ఏమైనా అమలాపాల్ చెప్పిన ఈ గుడ్ న్యూస్ కి మాత్రం అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు ఈమె కెరియర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈమె ఆడు జీవితం, ద్విజ సినిమాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.. ఇందుకు సంబంధించి ఒక పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు