Hanuman – Guntur kaaram: మహేష్ Vs తేజ.. బరిలో ఎవరిది పై చేయి..?

తాజాగా సంక్రాంతికి పోటీ పడడానికి స్టార్ హీరోనే కాదు యంగ్ హీరోలు కూడా బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, యంగ్ హీరో తేజ నటించిన హనుమాన్ చిత్రాలు రెండూ పోటీకి నిలవడం ఇప్పుడు ఇండస్ట్రీలో పలు అనుమానాలకు దారితీస్తోంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం గుంటూరు కారం.. ఈ సినిమాతో పాటు అదే రోజున ప్రశాంత్ వర్మ , యువ హీరో తేజ నటించిన హనుమాన్ మూవీ కూడా విడుదల కాబోతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఒకేరోజు విడుదల అవుతుండడంతో ఇప్పుడు అందరి దృష్టి హనుమాన్ పై పడింది..

అసలు హనుమాన్ చిత్ర బృందం ఏ ధీమాతో గుంటూరు కారం సినిమాకి పోటీగా నిలుస్తోంది అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇకపోతే రెండూ ఒకేరోజు విడుదలవుతూ ఉండడం పైగా గుంటూరు కారం సినిమాకి థియేటర్ల కేటాయింపు జరిగిన నేపథ్యంలో ఏ ధీమాతో హనుమాన్ చిత్ర బృందం ఇలా పోటీకి దిగుతోంది అంటూ వార్తలు వినిపిస్తుండగా.. దానికి నార్త్ ఇండియా మార్కెట్ ప్రధాన కారణం అని తెలుస్తోంది. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం హనుమాన్ టీజర్ విడుదల కాగానే.. హిందీ మార్కెట్ నుంచి ఎంక్వయిరీలు మొదలయ్యాయి..

దీంతో ప్రశాంత్ వర్మ ఈ సినిమాకి నార్త్ ఇండియన్ మార్కెట్లో భారీగా క్రేజ్ ఉంటుందని గ్రహించి సినిమా విడుదల తేదీని ఎనిమిది నెలలు పోస్ట్ పోన్ చేశారు. అంతేకాదు చిన్న సినిమాను పెద్ద సినిమాగా డిజైన్ చేయడానికి అంత గ్యాప్ తీసుకున్నా.. ఇప్పుడు ఈనెల 12న తెలుగు, తమిళ్, హిందీ తో పాటు పలు భాషలలో విడుదల చేస్తున్నారు.ఇక ప్రస్తుతం మెయిన్ టార్గెట్ తెలుగు , హిందీ మార్కెట్లే ప్రధాన కారణం.. ముఖ్యంగా నార్త్ ఇండియన్ మార్కెట్ పై హనుమాన్ టీం చాలా ధీమాగా ఉంది. 1500 థియేటర్లు ఇప్పటికే నార్త్ ఇండియా మార్కెట్లో ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాయి.. దానికి తోడు ఇండియాలో అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ మూడ్ కూడా మొదలయ్యింది..

- Advertisement -

నార్త్ ఇండియాలో రామ మందిర్ ఒక ఎమోషన్.. అందుకే హనుమాన్ చిత్రానికి నార్త్ ఇండియాలో బాగా డిమాండ్ ఉంటుందని.. అందుకే గట్టి నమ్మకంతో బయ్యర్లు కూడా ఈ సినిమాని కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇలాంటి సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు , యంగ్ హీరో తేజ సంక్రాంతి బరిలో పోటీకి దిగుతున్నారు. మరి ఎవరిది పై చేయి అవుతుందో తెలియాలి అంటే జనవరి 12 వరకు ఎదురు చూడాల్సిందే.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు