Ramba: హీరో రజనీకాంత్ పై హీరోయిన్ రంభ సంచలన వ్యాఖ్యలు..!!

సౌత్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీ వరకు ఒక ఊపు ఊపేసిన హీరోయిన్లలో హాట్ హీరోయిన్ రంభ కూడా ఒకరు..1990 లో ఎంతోమంది అగ్ర హీరోలతో నటించి అగ్ర కథానాయికగా పేరు సంపాదించింది ఈ ముద్దుగుమ్మ.. మొదటిసారి సుందర్ సి దర్శకత్వంలో వచ్చిన ఉన్నతై ఆల్లిత్త అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది రంభ.. ఇందులో కార్తీక్ సరసన రంభ నటించిగా.. మంచి పాపులారిటీ అందుకుంది. ఆ వెంటనే వరుస ఆఫర్లతో దూసుకుపోయింది. రంభ కెరియర్ లో ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాలలో నటించింది.

అలా సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూడా నటించే అవకాశం అందుకుంది.. డైరెక్టర్ సుందర్ సి డైరెక్షన్లో రజనీకాంత్ నటించిన అరుణాచలం సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు.. ఇందులో రంభ రజనీకాంత్ పీ ఏ గా కనిపించి అద్భుతంగా నటించింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో రజనీకాంత్ చేసిన పని వల్ల రంభ కన్నీళ్లు పెట్టుకున్నట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.

రంభ మాట్లాడుతూ.. అరుణాచలం సినిమాలో నటిస్తున్న సమయంలో సల్మాన్ ఖాన్ తో బంధన్ అనే ఒక బాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. రెండు సినిమా షూటింగులు హైదరాబాదులోని జరుగుతున్నాయి.. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అరుణాచలం సినిమా షూటింగ్.. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సల్మాన్ ఖాన్ తో బంధన్ సినిమా షూటింగ్ చేశానని తెలిపింది.. ఇలా షూటింగ్ జరుగుతున్న సమయంలో బంధన్ షూటింగ్ పార్ట్ నుంచి సల్మాన్ ఖాన్ తో పాటు జాకీ ష్రాఫ్ లు రజనీకాంత్ ని చూడడానికి అరుణాచలం సినిమా షూటింగ్ సెట్ కి వచ్చారట.

- Advertisement -

అయితే వీళ్లను చూసిన రంభ ఒక్కసారిగా మా హీరో వచ్చాడు అన్నట్టుగా తాను ఎక్కడ ఉన్నాననే విషయాన్ని మరిచిపోయి వెంటనే సల్మాన్ ఖాన్ ను కౌగిలించుకొని పలకరించిందట. ఇదంతా రజనీకాంత్ దూరం నుంచి చూసారట .అలా అందరితో రజనీకాంత్ మాట్లాడరని.. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత అసలు కథ మొదలయ్యిందని తెలిపింది రంభ.

ఆ వెంటనే సెట్లో చాలా గందరగోళం మొదలయ్యింది ..మొదటిసారి రజనీకాంత్ టవల్ విసిరేసి ఆగ్రహంతో మాట్లాడారు.. సుందర్ మాత్రం నా వైపు చూశారు.. నాకు ఏమీ అర్థం కావడం లేదు.. అక్కడ దగ్గరలో ఉన్న కెమెరామెన్ వచ్చి ఎందుకు మేడం ఇలా చేశారు .ఇకపై మీతో సినిమాలు చేయనని రజనీకాంత్ అంటున్నారని చెప్పడంతో ఒక్కసారిగా ఏడ్చేశాను
అలా నా ఏడ్పు చూసిన రజనీకాంత్ ఒకసారి గా పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను ఓదార్చారు అంటూ తెలిపారు. ఏం జరిగిందనే విషయాన్ని రజనీకాంత్ ని అడగగా వెంటనే ఆయన రంభ సల్మాన్ ఖాన్ ని ఎలా కౌగిలించుకుందో ప్రాక్టికల్ గా చేసి చూపించారట.. కానీ తమ సినిమా షూటింగ్ సెట్లో అలా ఉండదంటూ హిందీ నటుడు అయితేనేమి వెళ్లి కౌగిలించుకుంటారా అంటూ సరదాగా తనని ఏడిపించారని రంభ తెలియజేసింది.

 

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు