Lokesh kanagaraj: డైరెక్టర్ లోకేష్ పై కేస్ నమోదు.. టెన్షన్ లో ఫ్యాన్స్..!

కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు సినిమాటిక్ యూనివర్శిటీలో భాగంగా ఎన్నో చిత్రాలను తెరకెక్కిస్తూ ఉన్నారు.. గత ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 19వ తేదీన హీరో దళపతి విజయ్ తో కలిసి లియో సినిమాని తెరకెక్కించి విడుదల చేశారు.. అయితే టాక్ తో సంబంధం లేకుండా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ .600 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది లియో మూవీ.. కానీ అనుకున్న రేంజ్ లో అంచనాలను మాత్రం అందుకోలేకపోయిందని చెప్పవచ్చు. కథ పరంగా అభిమానులు నిరాశతో ఉన్నా.. కలెక్షన్స్ పరంగా నిర్మాతలు మాత్రం హ్యాపీ.

ఇదిలావుంటే మరోవైపు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో లియో సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.. ఇదంతా ఇలా ఉండగా ఎవరు ఊహించని విధంగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పై మధురై హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది.. ఎందుకంటే లియో సినిమాను హింసను ప్రేరేపించే విధంగా చూపించారంటూ మదురై కు చెందిన రాజు మురుగన్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.. డైరెక్టర్ మానసిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటూ .. అలాగే సైకలాజికల్ టెస్ట్ నిర్వహించాలంటూ కూడా కోరడం జరిగింది.

మారణాయుధాలు, మాదకద్రవ్యాల వియోగం మతపరమైన చిహ్నాలను.. చిన్నారుల పైన హింస.. మహిళలను హింసించే సన్నివేశాలు సినిమాలో ఎక్కువగా ఉన్నాయని… ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ పిటిషన్ లో తెలియజేశారు.. నిన్నటి రోజున ఈ సినిమా పిటిషన్ కు వచ్చినట్లుగా తెలుస్తోంది
ఈ విషయం పైన మధురై హైకోర్టు జస్టిస్ కృష్ణ కుమార్, జస్టిస్ విజయ్ కుమార్ విచారణ చేపట్టినట్లుగా తెలుస్తోంది..

- Advertisement -

అయితే లోకేష్ తరఫున న్యాయవాదులు హాజరు కాకపోవడంతో ఈ విషయాన్ని వాయిదా వేసినట్లుగా సమాచారం. లియో సినిమా లో సంజయ్ దత్, మిస్కిన్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్ వంటి వారు కీలకమైన పాత్రలో నటించారు. అలాగే మన్సూర్ అలీ ఖాన్, ప్రియ ఆనంద్ పలువురు సెలబ్రిటీలు సైతం కీలక పాత్రలో నటించారు. విజయ్ కి జోడిగా త్రిష హీరోయిన్ గా నటించింది. మరి చివరికి లియో సినిమా విషయంలో డైరెక్టర్ లోకేష్ కనగరాజు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు