Bollywood Star kids: ఈ స్టార్ కిడ్స్ టాలెంట్ చూస్తే మతి పోవాల్సిందే..!

Bollywood Star kids: సినీ ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ అనగానే ముందుగా బాలీవుడ్ ఇండస్ట్రీ గుర్తుకొస్తుంది. బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీల వారసులిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న వీరు.. చదువులో సూపర్ టాలెంటెడ్ అని తెలిసి ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోతోంది. ఇకపోతే బాలీవుడ్ లో ఈ స్టార్ కిడ్స్ నటనలో ఇరగదీస్తున్న వీరు చదువు విషయంలో కూడా తాము సరస్వతి దేవి పుత్రులు, పుత్రికలు అని నిరూపించుకుంటున్నారు. ఇకపోతే చదువులో అత్యున్నత స్థానంలో ఉన్న బాలీవుడ్ స్టార్ కిడ్స్ గురించి ఇప్పుడు చూద్దాం..

ఆర్యన్ ఖాన్:

 Bollywood Star kids educational qualification

- Advertisement -

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ వారసుడు ఆర్యన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన ఇప్పుడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని అనుకుంటున్నార. ఇక ఆర్యన్ ఖాన్ విద్యాభ్యాసం విషయానికి వస్తే.. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో తన స్కూలింగ్ పూర్తి చేశాడు. మార్షల్ ఆర్ట్స్ లో కూడా నైపుణ్యం సాధించాడు. అలాగే తైక్వాండో లో బ్లాక్ బెల్ట్ కూడా సాధించారు.

జాన్వీ కపూర్:

 Bollywood Star kids educational qualification
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ బాలీవుడ్లో తన కెరీర్ ను మొదలుపెట్టి ఇప్పుడు టాలీవుడ్ లో దేవరా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. ఇక ఈమె కూడా చదువులో సరస్వతి అని చాలామందికి తెలియదు. యూఎస్ఏ లోని లీ స్ట్రాస్ బర్గ్ ఫిలిం యూనివర్సిటీలో చదువుకుంది. అలాగే ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా చదివింది.

సారా అలీఖాన్:

 Bollywood Star kids educational qualification
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ బాలీవుడ్ లో ఇప్పుడు సత్తా చాటుతుంది. కొలంబియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈమె హిస్టరీ , పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ కూడా చేసింది.

సుహానా ఖాన్:

 Bollywood Star kids educational qualification
షారుక్ ఖాన్ ముద్దుల కుమార్తె సుహానా రీసెంట్ గా యాక్టింగ్ కెరియర్ ని మొదలుపెట్టింది. న్యూయార్క్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈమె ధీరూ భాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో తన స్కూలింగ్ పూర్తి చేసింది.

వరుణ్ ధావన్:

 Bollywood Star kids educational qualification
బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్న ఈయన నొటింగమ్ ట్రెండ్ యునివర్సిటీ లో బిజినెస్ స్టడీస్ లో డిగ్రీ పట్టా అందుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు