Kollywood: ఎయిర్ పోర్ట్ లో ఆ హీరోయిన్ కి చేదు అనుభవం..

మలయాళ కుట్టి మాళవిక మోహనన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో సినిమాలు చేయకపోయినా డబ్బింగ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక మాస్టర్ సినిమాతో కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిన ఈ భామ అక్కడ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇక అప్పుడప్పుడూ ఇంస్టా లో మత్తెక్కించే పోస్టులు కూడా పెడుతూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంటుంది.

ఇదిలా ఉండగా ఈ కేరళ కుట్టికి తాజాగా జైపూర్ ఎయిర్ పోర్ట్ లో చేదు అనుభవం ఎదురైంది. ఓ పార్టీ నిమిత్తం జైపూర్ వెళ్లిన మాళవిక, తర్వాత తిరుగు ప్రయాణంలో వస్తుండగా, అక్కడ జైపూర్ ఎయిర్ పోర్ట్ లో ఇండిగో విమానాశ్రయం వద్ద తనకు అవమానం జరిగిందని, ఇండిగో స్టాఫ్ తనతో చాలా మొరటుగా ప్రవర్తించారని, వాళ్ళ సర్వీస్ అస్సలు బాగా లేదని ట్విట్టర్ లో తెలియచేసింది.

అయితే దీనిపై స్పందించిన ఇండిగో జైపూర్ సంస్థ ఆఫీసర్ ‘స్నిగ్ధ’ ఈ ఘటన గురించి తెలుసుకుని చింతిస్తున్నాం.. దీనిపై విచారణ జరుపుతాం. తిరిగి మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం అని ట్విట్టర్ లో రిప్లై ఇచ్చారు. ఇక తనతో దురుసుగా ప్రవర్తించిన వారిని ఇంస్టా లో ఫోటో కూడా తీసి స్టేటస్ పెట్టింది. ఈ విషయంపైన సోషల్ మీడియా లో నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. కొందరు మాళవిక కి సపోర్ట్ చేస్తుంటే, మరి కొందరు అక్కడేం జరిగిందో సరిగ్గా తెలియకుండా ఎవరి వైపు మాట్లాడకూడదు అంటున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు