Sudheer Babu: ఏమాటకామాట..! మహేష్ మేనల్లుడు అదిరిపోయాడయ్యా..

టాలీవుడ్ లో అందగాళ్ళ ఫ్యామిలీ అంటే ఘట్టమనేని ఫ్యామిలీ అని అంటారు. అదేంటి అక్కినేని ఫ్యామిలీ అని కదా అనాలి అంటారా.. ఆ మాట ఒక్కసారి మహేష్ ఫ్యామిలీ కుర్రాళ్ళని చూసి చెప్పండి.. మీరే ఒప్పుకుంటారు. అవును.. సూపర్ స్టార్ కృష్ణ ఆ రోజుల్లో ఎన్టీఆర్ తర్వాత, అత్యంత ప్రజాదరణ పొందిన హీరోల్లో ఒకడిగా నిలవడానికి తన గ్లామర్ చాలా ప్లస్ అయింది. ఆ తర్వాత తండ్రి లెగసి ని స్టార్ డమ్ తో పాటు గ్లామర్ ని కూడా పుణికి పుచ్చుకుని మహేష్ బాబు టాలీవుడ్ లో టాప్ స్టార్ గా ఎదిగాడు.

ఇక మహేష్ బాబు ఏ రేంజ్ లో పాపులరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాభై పదుల వయసుకు దగ్గరవుతున్నా అదే గ్లామర్ మైంటైన్ చేస్తూ, టాలీవుడ్ లోనే కాదు ఒక రకంగా ఇండియా లోనే మహేష్ అంత అందగాడు లేడన్న పేరు సంపాదించాడు. ఇక ఆ తర్వాత ఇదే ఫ్యామిలి నుండి వచ్చిన హీరో సుధీర్ బాబు.. మహేష్ బాబు బావ అయిన ఇతడు మహేష్ అంత అందగాడు కాకపోయినా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో సుధీర్ బాబు పెద్ద కొడుకును చూశాక మాత్రం టాలీవుడ్ లో కొత్త చర్చ మొదలైంది.

ఈ మధ్య కాలంలో పలు ఈవెంట్లలో సందడి చేసిన సుధీర్ బాబు కొడుకు తన గ్లామర్ తో సోషల్ మీడియా లో అందర్నీ ఆకట్టుకున్నాడు, సుధీర్ బాబు కొడుకే అయినప్పటికీ ఆ కుర్రాడికి అన్ని మేనమామ మహేష్ బాబు పోలికలు అచ్చుగుద్దినట్టు రావడం విశేషం. అంతే కాదు నడవడిక లో కూడా మామనే దించేసాడు. ఇక లేటెస్ట్ గా సుధీర్ బాబు ఫ్యామిలీ తో కలిసి అండమాన్ దీవుల్లో న్యూ ఇయర్ ట్రిప్ కి వెళ్లగా, అక్కడ ఫొటోస్ ఇంస్టా లో షేర్ చేసాడు. ఇక ఆ పోస్ట్ కి లక్షల్లో లైక్స్ వస్తుండగా, అందులో కామెంట్స్ సుధీర్ కంటే తన పెద్ద కొడుకుపైనే ఉన్నాయి.

- Advertisement -

ఇక కొందరైతే మహేష్ బాబు మేనల్లుడు హీరో మెటీరియల్ అని, ఘట్టమనేని ఫ్యామిలి నుండి మరో హీరో రావడం పక్కా అనేస్తున్నారు. అయితే కొంత కాలం క్రితం మహేష్ అన్న రమేష్ బాబు చనిపోయినపుడు కూడా అతని కొడుకు బాగా వైరల్ అయ్యాడు. అతను కూడా హీరో అవుతాడని మహేష్ ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ అతనికి సినిమాల పట్ల అంతగా ఆసక్తిలేదని ఫ్యామిలీ సన్నిహితులు అన్నారు. ఏది ఏమైనా కొన్నేళ్ల తరువాత ఘట్టమనేని ఫ్యామిలి నుండి ఒకరు హీరోగా రావడం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు.

For More Updates :Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు