Sudheer babu: ‘కుప్పం సుబ్రహ్మణ్యం’ ఆయుధ పూజకి రేపే ముహూర్తం!

టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. ఘట్టమనేని బ్యాక్ గ్రౌండ్ నుండే వచ్చినప్పటికీ, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని, స్టార్ హీరో కాకపోయినా, చిన్న హీరోల్లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సమ్మోహనం వంటి క్లాస్ హిట్స్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సుధీర్ రీసెంట్ గా మామా మశ్చీన్ద్ర సినిమాతో ఆడియన్స్ ని పలకరించాడు. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. కానీ సుధీర్ బాబు నటనకి విమర్శల ప్రశంసలు వచ్చాయి.

ఇక లేటెస్ట్ గా మరో వైవిధ్యమైన సినిమాతో ఆడియన్స్ ని మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. జ్ఞాన సాగర్ అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఆ సినిమాకి “హరోం హర” అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాని శ్రీ సుబ్రహ్మణ్య సినిమాస్ బ్యానర్ లో సుమంత్ నాయుడు నిర్మిస్తున్నాడు. చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తుండగా హరోం హర మూవీ ఫస్ట్ లుక్ ని ఆక్టోబర్ 23న సాయంత్రం 5.55 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు.

ఇక అనౌన్స్ మెంట్ స్టిల్ లో సుధీర్ బాబు గన్ పట్టుకున్న స్టిల్ వదిలి ఈ కిత కుప్పం సుబ్రహ్మణ్యం ఆయుధ పూజ ఎట్లుంటదో చూస్తారా? అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు. దీన్ని బట్టి హరోం హర సినిమాలో హీరో పేరు సుబ్రహ్మణ్యం ఉండవచ్చని అనిపిస్తుంది. అయితే ఈ సినిమా ఏ బ్యాక్ డ్రాప్ లో వస్తుందో ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యాక క్లారిటీ రావొచ్చు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు