Mama Mashcheendra: ఎదో అన్నారు గాని.. పెద్ద కథేమీ లేదు భయ్యా..!

MamaMashcheendra:

టాలీవుడ్ లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు తీస్తూ ఆడియన్స్ ని అలరించే హీరోల్లో సుధీర్ బాబు ఒకరు. మహేష్ బాబు బావమరిది అయిన ఈ హీరోకు పెద్దగా సూపర్ హిట్లు కొట్టేంత రేంజ్ లేకపోయినా, మంచి స్క్రిప్ట్ లు ఎంచుకొని సినిమాలు చేసే టాలెంట్ ఉంది. లాస్ట్ సమ్మోహనం చిత్రం తో డీసెంట్ హిట్ అందుకున్న సుధీర్ ఆ తర్వాత వరుస ప్లాపులందుకున్నాడు. ఇప్పుడు చాల రోజుల తర్వాత ‘మామ మశ్చీంద్ర’ అంటూ ఒక విభిన్నమైన సినిమాతో వస్తున్నాడు.

ఇక ఈ సినిమాని ప్రముఖ నటుడు, దర్శకుడు అయిన హర్షవర్ధన్ తెరకెక్కించాడు. తాజాగా రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది. అయితే సినిమా టీజర్ వచ్చిన కొత్తలో సినిమాకి టైటిల్ ఎందుకు పెట్టారో గెస్ చేస్తే బంపర్ ఆఫర్ ఇస్తామని, స్టోరీ గురించి చెప్తే మంచి బహుమతులు ఇస్తామని ఇదేదో చెప్పి ప్రమోషన్లు చేసారు. తీరా ట్రైలర్ రిలీజ్ అయ్యాక, స్టోరీ పెద్దగా చెప్పుకోవడానికి ఏమి లేదని అనిపిస్తుంది.

కథ ప్రకారం హీరో చెల్లెలికి మేనమామ పోలికలతో తన లాగే ఇద్దరు పుడతారు. అనుకోకుండా వారు పెరిగి పెద్దవారై, హీరో కూతుళ్ళని ప్రేమిస్తారు. అయితే వాళ్ళు అనుకోకుండా వాళ్ళని ప్రేమిస్తారా? లేక వాళ్ళ మేనమామ పై రివేంజ్ తీర్చుకోవడానికి ఏదయినా ప్లాన్ చేసారా? అసలు వాళ్ళు నిజంగా మేనల్లుళ్లేనా? లేక ఇంకేమైనా అవుతారా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక సినిమా క్వాలిటీ అంత రిచ్ గా లేదని అనిపిస్తుంది. మ్యూజిక్ కూడా పెద్దగా ఇంటెస్టింగ్ గా లేదు. డైరెక్షన్ సినిమా చూస్తే గాని చెప్పలేము.

- Advertisement -

ఓవరాల్ గా ఈ మామ మశ్చీంద్ర ట్రైలర్ లో సుధీర్ బాబు ఒకడే తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు అని చెప్పొచ్చు. మరి సినిమా ఏ మేరకు మెప్పిస్తుందో తెలియాలంటే అక్టోబర్ 6వరకు ఆగాలి.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు