Mama Machindra: లావుగా మారిపోయిన సుధీర్ బాబు

తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో సుధీర్ బాబుకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎస్ఎంఎస్ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమైన సుధీర్ బాబు ఆ తర్వాత క్రమక్రమంగా ఎన్నో సినిమాలు నటించి మంచి విజయాలను కూడా అందుకున్నాడు. అయితే నైట్రో స్టార్ సుధీర్ బాబు ప్రస్తుతం తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టారు. ఈ తరుణంలోని తాజాగా సరికొత్త అవతారంలో కనిపించాడు సుధీర్ బాబు.

లావుగా ఉండటమే కాకుండా తను ఇంతవరకు ఎప్పుడు కనిపించని అన్ఫిట్ గా కనిపించాడు. “మామ మశ్చింద్ర” అనే సినిమా కోసం సుధీర్ బాబు ఈ బబ్లీ లుక్ లో కనిపించాడు. బుగ్గలు, పొట్ట ఇలా తను ఇంతవరకు ఎప్పుడూ కనిపించని రూపంలో దర్శనం ఇచ్చాడు. ఈ సినిమాలో సుధీర్ బాబు మల్టీ షేడెడ్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నాడు. ఇందులో భాగంగా దుర్గా అనే పాత్ర కోసం ఈ విధంగా తన రూపాన్ని మార్చుకున్నాడు. సుధీర్ బాబు లావుగా ఉండటమే కాకుండా డ్రెస్సింగ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ అంతా విలక్షణంగా ఉంది.

జీప్ పై కూర్చున్న ఈ హీరో నోట్లో బంగారు గొలుసుతో ఎవరినో తీక్షణంగా చూస్తున్నట్లు కనిపించాడు. పొడవాటి జుట్టు, తేలికపాటి గడ్డంతో దర్శనమిచ్చాడు. “మామ మశ్చింద్ర” అనే ఈ చిత్రానికి హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది చిత్రం. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కాగా ఈ సినిమా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు