Lavanya Tripathi: పార్టీలో మెగా ఫ్యామిలీ కోడలు రచ్చ రచ్చ… ఫోటోలు వైరల్

మిస్టర్ సినిమాతో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మధ్య ఎర్పడ్డ పరిచయం.. ప్రేమగా మారింది. రీసెంట్ గా పెద్దలను ఒప్పించడంతో పెళ్లి పీటల వరకు వచ్చింది. ఇప్పటికే ఎంగేజ్ మెంట్ పూర్తి చేసుకున్న ఈ జంట, మరి కొద్ది రోజుల్లోనే మూడు ముళ్ల బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెటబోతున్నారు. ఇటలీలోని టుస్కానీ నగరంలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారు.

టుస్కానీ నగరంలో డెస్టినేషన్ వెడ్డింగ్ కు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్ చరణ్, ఉపాసనతో నాగబాబు ఫ్యామిలీ ఇప్పటికే ఇటలీ చేరుకున్నారు. నవంబర్ 1న లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ వివాహం గ్రాండ్ గా జరగనుంది. ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరుకానున్నారు. అయితే తాజాగా లావణ్య త్రిపాఠికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Lavanya Tripathi's bachelor party photos are viral
Lavanya Tripathi’s bachelor party photos are viral

గత రాత్రి తన ఫ్రెండ్స్ తో లావణ్య త్రిపాఠి బ్యాచిలర్ పార్టీ చేసుకుంది. దీనికి టాలీవుడ్ హీరో నితిన్ భార్య షాలినీ, వరుణ్ తేజ్ సిస్టర్ నిహారిక, హీరోయిన్ రీతు వర్మ తో పాటు టాలీవుడ్ కి చెందిన కొంత మంది, లావణ్య త్రిపాఠి ఫ్రెండ్స్ హాజరయ్యారు. ఈ ఫోటోలను నిహారిక, లావణ్య త్రిపాఠి తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయ.

- Advertisement -

కాగా, బ్యాచిలర్స్ పార్టీ అయిపోయన తర్వాత వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటలీకి బయలుదేరినట్టు సమాచారం. మరి కొద్ది రోజుల్లోనే మెగా ఫ్యామిలీ కూడా ఇటలీకి పయనం కాబోతున్నట్టు తెలుస్తుంది. కాగా, పెళ్లి ఇంకా 9 రోజులో ఉండడంతో మెగా ఫ్యామిలీ పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు