Bhagavanth Kesari: అక్కడ చిరుతో సమంగా నిలిచిన బాలయ్య

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెకండ్ జనరేషన్ లో టాప్ హీరోలు గా టాలీవుడ్ చక్రం తిప్పిన ఈ హీరోలు ఇప్పటికి యంగ్ హీరోలకు సవాళ్లు విసురుతూ తమదైన శైలిలో జోరు చూపిస్తున్నారు. చిరు రీ ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ మూవీ తోనే 100కోట్ల క్లబ్ లో చేరి టాప్ హీరోలకు సవాళ్లు విసరగా, బాలకృష్ణ అఖండ తో భారీ హిట్ కొట్టి, వరుస హిట్లతో ఆ జోరుని కంటిన్యూ చేస్తున్నాడు.

అయితే వీళ్లిద్దరి సినిమాల్లో చిరంజీవి సినిమాలకి ఓవర్సీస్ లో గిరాకీ ఎక్కువ. ఎందుకంటే చిరంజీవి సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులు చూస్తారు. కానీ బాలయ్య సినిమాలు ఎక్కువగా మాస్ ఆడియన్స్ చూస్తూ ఉంటారు. అయితే లేటెస్ట్ గా బాలకృష్ణ సినిమాలు ఓవర్సీస్ లో కూడా రచ్చ చేస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టి, ఓవర్సీస్ లో 1 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరాడు.

అయితే మెగాస్టార్ చిరంజీవి కి ఓవర్సీస్ లో మిలియన్ డాలర్లు ఉన్న సినిమాలు 4 ఉన్నాయి. ఇప్పుడు బాలకృష్ణ లేటెస్ట్ గా వచ్చిన భగవంత్ కేసరి సినిమాతో మిలియన్ డాలర్ క్లబ్ లో చేరి, ఓవరాల్ గా 4 వన్ మిలియన్ డాలర్ సినిమాలు కలిగి ఓవర్సీస్ లో చిరంజీవి తో సమంగా నిలిచాడు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు