Leo vs Bhagavanth Kesari: బాక్సాఫీస్ వద్ద సాంబార్ సల్లబడ్డది – బిర్యానీ బలపడ్డది..!

ప్రతిసారిలాగే ఈ దసరాకి కూడా బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోటీ నెలకొంది. బాలకృష్ణ, అనిల్ రావిపూడిల క్రేజీ కాంబినేషన్లో రూపొందిన భగవంత్ కేసరి, లోకేష్ కనగరాజ్ తలపతి విజయ్ కాంబినేషన్లో రూపొందిన క్రేజీయెస్ట్ సినిమా లియో, రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలు దసరా బరిలో నిలిచాయి.
మూడు సినిమాల మీద అంచనాలు తారాస్థాయిలో నెలకొనగా డబ్బింగ్ సినిమా అయినప్పటికీ లియోకి తెలుగు అధిక థియేటర్స్ దక్కాయి. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమాలకు లియో కంటే తక్కువ థియేటర్స్ కేటాయించటం పట్ల అటు ఇండస్ట్రీ వర్గాల్లో, ఇటు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది.
అయితే, సినిమాలు రిలీజయ్యాక అసలు కథ మొదలైంది. భారీ అంచనాలతో రిలీజైన లియో సినిమాకి మిక్స్డ్ టాక్ రాగా భగవంత్ కేసరి సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. లియో ఫస్ట్ షో ఆక్యుపెన్సీ బాగానే ఉన్నప్పటికీ మిక్స్డ్ టాక్ కారణంగా తర్వాతి షోస్ కి డ్రాప్ అయ్యింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న భగవంత్ కేసరికి షోస్ గడీచేకొద్దీ అక్యుపెన్సీ పెరుగుతూ వచ్చింది.
సినిమా రిలీజ్ కి ముందు లియో సినిమాకి ఉన్న హైప్ చూసి భగవంత్ కేసరి సినిమాకి గట్టి పోటీ ఇస్తుందని బాక్సాఫీస్ వద్ద ఎదురు దెబ్బ తప్పదని భావించారు అంతా. కానీ, రిలీజయ్యాక సీన్ రివర్స్ అయ్యింది. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద సాంబార్ సల్లబడింది, బిర్యానీ బలపడిందని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. ఆ రకంగా జైలర్ తో షాక్ ఇచ్చిన కోలీవుడ్ కి లియో సినిమా భగవంత్ కేసరి దెబ్బతో టాలీవుడ్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్లయింది.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు