Bhagavanth Kesari: ఫస్ట్ డే చిచ్చా ఇచ్చి పడేశాడు..!

బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన భగవంత్ కేసరి సినిమా రిలీజయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. భారీ అంచనాలతో వచ్చిన లియో ఇచ్చిన పోటీని సైతం తట్టుకొని డీసెంట్ అక్యుపెన్సీని సొంతం చేసుకుంది భగవంత్ కేసరి సినిమా. ఎంటర్టైనర్స్ కి కేరాఫ్ అయిన అనిల్ రావిపూడి, బాలకృష్ణ కాంబినేషన్ కావటంతో ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుండే ఆసక్తి పెరిగింది.
ఈ సినిమాలో బాలకృష్ణ గత సినిమాలకు బిన్నంగా సటిల్ యాక్టింగ్ తో ఎక్కువ ఎమోషనల్ సీన్స్ లో కనిపించి మెప్పించటంతో ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న భగవంత్ కేసరి ఫస్ట్ డే 32.33కోట్ల గ్రాస్ వాసులు చేసింది.
వరల్డ్ వైడ్ 64కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమాకి ఫాస్ట్ డే ఈ ఓపెనింగ్స్ రావటం కలిసొచ్చే అంశం అని చెప్పాలి. పైగా లియో, టైగర్ నాగేశ్వరరావు సినిమాలకు మిక్స్డ్ టాక్ రావటం కూడా భగవంత్ కేసరి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే,లియో సినిమా కంటే భగవంత్ కేసరికి తక్కువ థియేటర్స్ కేటాయిచిన్నప్పటికీ ఈ రేంజ్ లో వసూళ్లు రాబట్టడంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సమీపంలో పెద్ద సినిమాలేవీ రిలీజ్ లేవు కాబట్టి ఈ సినిమాకి పోను పోనూ థియేటర్స్ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉండటంతో తొందరగానే బ్రేక్ ఈవెన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. మరి, అఖండ, వీర సీమాహారెడ్డి వంటి వరుస హిట్స్ తర్వాత బాలయ్యకి హ్యాట్రిక్ హిట్ ఇచ్చిన భగవంత్ కేసరి ఏ రేంజ్ లో వసూళ్లు రాబడుతుందో చూడాలి.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు