Tiger Nageswara Rao: టైగర్ నాగేశ్వరరావు ఓటీటీ రిలీజ్ అప్డేట్

రవితేజ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన టైగర్ నాగేశ్వరరావు చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలైంది. స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వంశీ తెరకెక్కించారు. అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. కాగా, ఈ సినిమాకు మొదటి షో నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. సినిమాలో మొదటి భాగం బాగుందని, రెండో భాగంలో సాగదీత ఉందని, 3 గంటలపైగా సినిమా ఉండటం సినిమా మైనస్ ఉందని టాక్ వస్తుంది.

అలాగే రవితేజ యాక్టింగ్ పరంగా ఆకట్టుకున్నాడని, టాలీవుడ్ లో మొదటి సారి కనిపిస్తున్న నూపర్ సనన్ పాత్రకు పెద్ద ఏం లేదని సినీ క్రిటిక్స్ తమ రివ్యూల్లో చెబుతున్నారు. అయితే కొన్ని పోరాట సన్నివేశాలతో పాటు స్టోరీ బాగుందని రివ్యూ ఇస్తున్నారు. అయితే డైరెక్టర్ వంశీ కథనాన్ని మరింత ఫోకస్ గా రాస్తే మంచి ఫలితం ఉండేదంటూ కామెంట్స్ వస్తున్నాయి. అయితే టైగర్ నాగేశ్వరరావు చిత్రం ఏ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందని ప్రేక్షకులు గుడ్ న్యూస్.

టైగర్ నాగేశ్వరరావు చిత్రం అమెజాన్ ప్రైమ్ లోకి రానుంది. అయితే నాలుగు వారాలకు వరకు వెయిట్ చేస్తారా లేదా, దీపావళి టైంలోనే ఓటీటీలోకి వదులతారా? అనేది తెలియాల్సిందే. అయితే దీపావళికి కాకుండా, డిసెంబర్ మొదటి వారంలో టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు