LEO Movie: డైరెక్టర్లకు ఇదో గుణపాఠం… ఈ ఫార్ములా ఫాలో కావాల్సిదేనా?

ఆడియన్స్ సినిమాలను చూసే స్టైల్ మారింది. రెగ్యూలర్ కంటెంట్ ఉంటే అది ఎంత భారీ బడ్జెట్ మూవీ అయినా సరే.. బొక్క బోర్లాపడాల్సిందే. అయితే కొన్ని సార్లు కంటెంట్ ఉన్నా… నెగిటివ్ టాక్ వస్తుంది. గురువారం రిలీజ్ అయిన లియో సినిమాలా అన్నమాట. లియోలో మంచి కంటెంట్ ఉంది. లోకేష్ కనగరాజ్ స్టైల్ ఉంది. విజయ్ మార్క్ ఉంది. కానీ, నెగిటివ్ టాక్ వచ్చింది.

ఎందుకంటే… ఓ చిన్న సమాధానం ఉంది. కేజీఎఫ్ సినిమా వచ్చిన తర్వాత ఆడియన్స్ అందరూ సినిమాలో తమ అభిమాన హీరో ఎలివేట్ అవ్వడం చూడాలని అనుకుంటున్నారు. దీన్ని కొంత మంది డైరెక్టర్లు గుర్తించారు. అందుకే అడుగడుగున హీరోకు ఎలివేషన్ ఇచ్చేస్తున్నారు. ఇదే కోలీవుడ్ ఇటీవల జైలర్ మూవీ వచ్చింది. రెగ్యూలర్ స్టోరీ. కానీ, ఇందులో కొత్తేమీ ఉందంటే.. హీరో పాత్రను డిజైన్ చేయడంలో గానీ, రజినీకాంత్ కు పడ్డ ఎలివేషన్స్ సీన్స్ గానీ బాగా వర్కౌట్ అయ్యాయి. అందుకే జైలర్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

ఇప్పుడు లియోలో ఈ ఎలివేషన్సే కరువయ్యాయి. అందుకే ఈ నెగిటివ్ టాక్. అయితే లోకేష్ కనగరాజ్ ఈ ఎలివేషన్ మంత్ర తెలీదా అంటే… తెలుసు. అందుకే కమల్ హాసన్ తో వచ్చిన విక్రమ్ మూవీ అంత పెద్ద హిట్ అయింది. విక్రమ్ సినిమాలో హీరో కమల్ హాసన్ కి మాత్రమే కాదు, విలన్ పాత్ర చేసిన విజయ్ సేతుపతి పాత్రకు, కీ పాత్రలో కనిపించిన ఫహద్ ఫజిల్ పాత్రకు కూడా ఎలివేషన్స్ ఇచ్చాడు. కానీ, లియోకి వచ్చే సరికి అది మరిచాడు.

- Advertisement -

లియో సినిమాలో హీరో… తనను తాను కవర్ చేసుకోవడానికే ప్రయత్నిస్తాడు. ఫైట్స్ కూడా కవర్ చేసుకుంటున్నట్టే ఉంటాయి. దీంతో హీరోకి పడాల్సిన ఎలివేషన్స్ మిస్ అయ్యాయి. పార్థీబన్ పాత్రకు కాకుండా, సమయం వచ్చినప్పుడల్లా ఫ్లాష్ బ్యాక్స్ పెడుతూ లియో పాత్రకు అయినా ఎలివేషన్స్ ఇస్తే బాగుండేది. అప్పుడైనా ఆడియన్స్ కొంత మేరకు అయినా సాటిస్ఫై అయ్యేవాళ్లు.

సో.. ఇప్పుడు లియో సినిమాతో తెలిసింది ఏంటంటే.. కంటెంట్ ఒకటి బాగుండే సరిపోదు.. కంటెంట్ తో పాటు హీరోను ఎలివేట్ చేసే సన్నివేశాలను డైరెక్టర్స్ స్పెషల్ కేర్ తో రాసుకోవాల్సిందే.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు