Tiger Nageswara Rao: డైరెక్టర్ అతి నమ్మకమే టైగర్ కొంప ముంచిందా..? 

మాస్ మహారాజ రవితేజ టైటిల్ రోల్ లో నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో అలరించకపోవటంతో ఫస్ట్ షో నుండే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది.

యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమా డ్యూరేషన్ పెద్ద మైనస్ అయ్యిందని చెప్పాలి.3 గంటల నిడివికి తోడు ఫస్ట్ హాఫ్ లో స్టోరీని డీవియేట్ చేసే లవ్ ట్రాక్, కొన్ని అనవసరమైన సీన్లు ప్రేక్షకుడ్ని విసిగిస్తాయి. పర్ఫామెన్స్ పరంగా హీరో రవితేజ తన క్యారెక్టర్ పూర్తి న్యాయం చేసినప్పటికీ డైరెక్టర్ చేసిన పొరపాట్లు హీరో కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా మార్చేశాయి.

బయోపిక్ ని కథగా ఎంచుకున్నప్పుడు సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోవటం సహజమే కానీ అది శృతి మించితే మాత్రం అసలుకే మోసం జరుగుతుంది. టైగర్ నాగేశ్వరరావు సినిమా విషయంలో అదే జరిగింది. నిజానికి స్టువర్ట్ పురం నాగేశ్వరావు గురించి కథలు కథలుగా వినడమే తప్పించి ఎక్కడా క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు. దీంతో డైరెక్టర్ ఎక్కువ శాతం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు.

- Advertisement -

యాక్షన్ సీక్వెన్స్ లు, కెమెరా వర్క్ సినిమాకి హైలైట్ గా నిలిచినప్పటికీ 3 గంటల సుదీర్ఘ నిడివి వల్ల వాటిని ఎంజాయ్ చేయలేము. పైగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే లవ్ ట్రాక్ కూడా పంటి కింద రాయిలా ఇబ్బంది పెడుతుంది. మొత్తానికి టైగర్ నాగేశ్వరరావు క్యారెక్టర్ కి రవితేజ సర్వశక్తులు ఒడ్డి పడ్డ కష్టం అంత డైరెక్టర్ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల వృధా అయ్యి మాస్ మహారాజ ఖాతాలో మరొక డిజాస్టర్ కి దారి తీసింది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు