Tiger Nageswara Rao: సాంబార్ మోజులో పడి మన బిర్యానీకి అన్యాయం చేస్తున్నారా..?

ఒకప్పటిలా సినిమాకు లాంగ్వేజ్ బ్యారియర్స్ ఇప్పుడు లేవు. పెరుగుతున్న పాన్ ఇండియా కల్చర్, విస్తరిస్తున్న ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ కారణంగా ఆడియెన్స్ ఇప్పుడు లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా వరల్డ్ వైడ్ కంటెంట్ ని చూడగలుగుతున్నారు. ముఖ్యంగా ప్యాండమిక్ తర్వాత నుండి ఓటీటీలో వరల్డ్ వైడ్ కంటెంట్ కి బాగా అలవాటు పడ్డారు జనాలు.

కేజిఎఫ్, కాంతారా సినిమాల వల్ల కన్నడ ఇండస్ట్రీకి నేషనల్ వైడ్ గుర్తింపు రాగా, కంటెంట్ ఉన్న సినిమాలతో మలయాళ ఇండస్ట్రీ ఓటీటీలో దున్నేస్తోంది. ఇక తమిళ సినిమాలకు టాలీవుడ్లో ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సూర్య, కార్తీ లాంటి హీరోలకు తమిళ్ కంటే తెలుగులో ఎక్కువ క్రేజ్ ఉందనడంలో అతిశయోక్తి లేదు.

అయితే, డబ్బింగ్ సినిమాల ఒక్కోసారి స్ట్రైట్ సినిమాలకు డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న లియో వల్ల రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరావు సినిమా విషయంలో ఇదే జరుగుతోంది. ప్రొడ్యూసర్ నాగవంశీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న లియో సినిమాకి 800కి పైగా స్క్రీన్స్ కేటాయించగా, టైగర్ కి కేవలం 500 ప్లస్ స్క్రీన్స్ కేటాయించటమే ఇందుకు కారణం.

- Advertisement -

లియో సినిమా వల్ల టైగర్ నాగేశ్వరరావు సినిమాకి మాత్రమే కాదు, బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమాకు కూడా ఇబ్బందులు తప్పట్లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో లియో స్పీడ్ మీద ఉండటం, భగవంత్ కేసరి కాస్త స్లో అవ్వడమే ఇందుకు కారణం. డబ్బింగ్  సినిమాలు సక్సెస్ అవ్వటం హర్షించదగ్గ పరిణామమే కానీ, దసరా లాంటి ఫెస్టివల్ సీజన్లో స్ట్రైట్ సినిమాలను డామినేట్ చేయటం ఆందోళనకరం.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు