Tiger Nageswara Rao Release Date: టైగర్ ఒక అడుగు వెనక్కి వేయాల్సింది

స్టూవర్ట్‌ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ అంటే ఎక్కడ లేని అంచనాలు వచ్చాయి. అందులో రవితేజ అంటే ఆ హైప్ మరింత పీక్స్‌కి వెళ్లిపోయింది. ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, పాన్ ఇండియా వైడ్‌గా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్ కూడా సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. సినిమాకు మంచి ఓపెనింగ్స్, దాని కంటే మంచి కలెక్షన్లు రావడానికి ఇది చాలు.

కానీ, ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు పరిస్థితి ఏటు చేప్పలేని విధంగా ఉంది. సినిమాకు పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. కానీ, థియేటర్సే దొరకడం లేదు. తమిళనాడులో కేవలం 30 థియేటర్స్ మాత్రమే వచ్చాయనే న్యూస్ మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ కి మాత్రం మింగుడు పడటం లేదు. సరే పక్క రాష్ట్రాలను వదిలేసి.. మన తెలుగు రాష్ట్రాల్లో అయినా పరిస్థితి బాగుందా? అంటే అదీ లేదు.

తెలుగు రాష్ట్రాల్లో బాలయ్య నటించిన భగవంత్ కేసరితో పాటు డబ్బింగ్ మూవీ లియో రిలీజ్ అవుతుంది. బాలయ్య వల్లనో… సినిమాకు ఇప్పటి వరకు ఉన్న హైప్ వల్లో తెలియదు కానీ, భగవంత్ కేసరికి 900+ థియేటర్స్ వచ్చాయి. ఇక డబ్బింగ్ మూవీ అయిన లియోను తెలుగు రైట్స్ సితారా ఎంటర్‌టైన్‌మెంట్ దగ్గర ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ పరంగా నాగవంశీకి ఎంత పట్టు ఉందో అందరికీ తెలుసు.

- Advertisement -

ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు దగ్గరికి వస్తే… థియేటర్స్ పట్టుమని 300 కూడా రావడం లేదట. నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఎంత ట్రై చేసిన ఈ నెంబర్ పెద్దగా పెరగడం లేదని తెలుస్తోంది. దీంతో రిలీజ్ డేట్ ను మార్చుకుంటే బాగుంటుందని సినీ క్రిటిక్స్ సలహా ఇస్తున్నారు.

కానీ, మూవీ టీంకి ఓ చిన్న హోప్. తమ సినిమాపైన, తమ కంటెంట్ పైన నమ్మకం. ఇప్పుడు సినిమాకు కేటాయించిన థియేటర్స్ వల్ల ఓపెనింగ్స్ తక్కువ రావొచ్చు. కానీ, తర్వాత తమ సినిమాకు వచ్చే టాక్… థియేటర్స్ సంఖ్యను పెంచుతుంది అని నమ్ముతున్నారు. అయితే ఇది ఎంత వరకు జరుగుతుందో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు