Tiger Nageswara Rao: వాళ్లంతా నకిలీ రవితేజ నే ఒరిజినల్ -ముంబై గడ్డపై రవితేజకు దక్కిన అరుదైన గౌరవం

మాస్ మహారాజ్ రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర రావు సినిమా ట్రైలర్ నిన్న సాయంత్రం రిలీజైన సంగతి తెలిసిందే. గూస్ బమ్స్ తెప్పించేలా ఉన్నఈ టైగర్ నాగేశ్వర రావు సినిమా ట్రైలర్ కు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా అన్ని భాషలలో ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ సినిమాకు ట్రైలర్ కు తెలుగులో వచ్చిన రెస్పాన్స్ కంటే కూడా హిందీ లో ఎక్కువ స్పందన లభించింది. అంతేకాదు ముంబై వేదికగా రిలీజ్ చేసిన టైగర్ నాగేశ్వర రావు సినిమా ట్రైలర్ ఈవెంట్ లో మాస్ మహారాజ్ రవితేజ కు స్టేజ్ పైన అరుదైన గౌరవం కూడా దక్కింది.

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై రాబోతున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాను డైరెక్టర్ వంశి తెరకెక్కించాడు .రవితేజ కెరీర్ లోనే మొదటి పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ప్రస్తుతం ఇండియా వైడ్ గా మంచి బజ్ ను క్రియేట్ చేసింది. రవితేజ గత చిత్రం రావణాసుర ఫ్లాప్ అయిన కూడా టైగర్ నాగేశ్వర రావు సినిమా క్వాలిటీలో కంప్రమైజ్ అవకుండా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకోస్తునందుకు అందరు మూవీ టీం కు అభినందనలు కూడా దక్కాయి.

ఇక బాలీవుడ్ నటుడు అనుపమ ఖేర్ టైగర్ నాగేశ్వర రావు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రవితేజ గురించి మాట్లాడుతూ మీరు హిందీలో చూసిన అక్షయ్ కుమార్ రౌడీ రాథోడ్ కు కిక్ సల్మాన్ ఖాన్ కు ఒరిజినల్ హీరో ఈ రవితేజ నే అంటూ బాలీవుడ్ మీడియాకు ఆయన హీరో రవితేజ ను పరిచయం చేసాడు. అనుపమ ఖేర్ రవితేజకు ఇచ్చిన ఈ ఎలివేషన్ కు ఒక్కసారిగా అందరు అరుపులు కేకలు వేశారు. ఆ తరువాత ప్రెస్ మీట్ లో మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు మూవీ టీం. హీరో రవితేజ విలేకర్లందరితో హిందీలోనే మాట్లాడటం ఈవెంట్ కు ప్రధానాకర్షణగా నిలిచింది. ఇక ప్రస్తుతం చూస్తే రవితేజకు అనుపమ ఖేర్ ఇచ్చిన ఆ రెండు మాటల ఎలివేషన్ వీడియో బైట్ సోషల్ మీడియాలో ట్రేండింగ్ గా మారింది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు