Tiger Nageswara Rao Trailer : టైగర్ నాగేశ్వర రావు ట్రైలర్ లో అదే హైలెట్

మాస్ మహారాజ్ రవితేజ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వర రావు ట్రైలర్ కాసేపటి క్రితమే రిలీజయింది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా కు డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో వహించారు.

ఇక ట్రైలర్ విషయానికొస్తే ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని కమర్షియల్ హంగులతో ఆద్యంతం ఆసక్తి కరంగా సాగింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ పరంగా టైగర్ నాగేశ్వర రావు సినిమా క్వాలిటీ అందరిని ఆకట్టుకుంటోంది. రవితేజ సరసన ఈ సినిమాలో నుపుర్ సనన్ హీరోయిన్ గా నటించింది. సీనియర్ నటి రేణు దేశాయ్ ప్రధాన పాత్రలో కనిపించబోతుంది.

భారత దేశంలోనే అతి పెద్ద దొంగగా పేరున్న టైగర్ నాగేశ్వర రావు జీవితం పై వచ్చిన పలు రూమర్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక రవితేజ కెరీర్ లోనే మొదటి పాన్ ఇండియా చిత్రంగా టైగర్ నాగేశ్వర రావు సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 20 న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్.

- Advertisement -

ఇక ఈ సినిమా ట్రైలర్ లో  హైలెట్స్ విషయానికొస్తే మొదటగా రవితేజ మేకోవర్ అనే చెప్పాలి. గతకొద్ది కాలంగా  రవితేజ  చేస్తున్న సినిమాలలో ఆయన ఒకే రకమైన లుక్ లో కనిపిస్తూ వచ్చాడు. అయితే ఈ సినిమాలో మాత్రం కాస్త లుక్ పరంగా డస్కీ స్క్రీన్ తో కొత్తగా కనిపించాడు. అలాగే సినిమాలో ట్రైన్ దొంగతనం ఎపిసోడ్ ప్రధానాకర్షణగా నిలుస్తోందని తెలుస్తోంది. ఎందుకంటే గతంలో రిలీజ్ చేసిన టీజర్ లో మరియు పోస్టర్స్ లో పదే పదే మేకర్స్ ట్రైన్ ఎపిసోడ్ ను హై లెట్ చేస్తూ వస్తున్నారు.

ఏది ఏమైనప్పటికి  రవితేజ టైగర్ నాగేశ్వర రావు సినిమాతో రవితేజ సాలిడ్ కంబ్యాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ట్రైలర్ తోనే ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేస్తున్న టైగర్ నాగేశ్వర రావు సినిమా మరీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇటీవలనే విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోగా ట్రైలర్ లో కూడా బ్యాగ్రౌండ్ అందరిని ఆకట్టుకుంటుంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు