Sai rajesh : బేబీ తమిళ్ రీమేక్ కు సర్వం సిద్ధం

Sai rajesh

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలలో తెరకెక్కిన బేబీ సినిమా గత జులై 14న రిలీజై, ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ బేబీ ఈ ఏడాది రిలీజైన మీడియం బడ్జెట్ సినిమాలలో సంచలనం సృష్టించింది. బేబీ సినిమా థియేటర్ రన్ మొత్తంలోదాదాపు 90 కోట్ల గ్రాస్ ను రాబట్టి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

సాయి రాజేష్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ బేబీ సినిమాను మాస్ మూవీ ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్ పై యస్ కే యన్ నిర్మించారు.ఇక ఇటీవలనే బేబీ సినిమా థియేటర్ రన్ ముగించుకొని, ఆహా ఓటిటిలో రిలీజ్ అయింది. బేబీ కేవలం థియేటర్ లోనే కాకుండా ఓటిటి లో కూడా మంచి రెస్పాన్స్ నే అందుకుంది.అయితే బేబీ సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టడంతో లేటెస్ట్ గా బేబీ సినిమాను తమిళ్ లో కూడా రీమేక్ చేయడానికి మేకర్స్ ప్రయత్నాలు చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవల కాలంలో ఇతర భాషలలో సూపర్ హిట్టైన సినిమాలన్నీ ఓటిటిలో రిలీజ్ అవుతున్న సమయంలో తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగు ఆడియో డబ్బింగ్ చెప్పించి అందుబాటులోకి తెస్తున్నారు. కానీ బేబీ రిలీజై ఇన్ని రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఈ సినిమా తమిళ్ ఆడియో ఆహాలో రాలేదు. అయితే దీనికి కారణం బేబీ సినిమాను తమిళ్ రీమేక్ చేయాలనే ఆలోచన మేకర్స్ లో ఉండటం వల్లనే అని తెలుస్తోంది. బేబీ సినిమా తెలుగులో రిలీజైన సమయంలో కూడా తమిళ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ బేబీ సినిమాను ప్రశంసిస్తూ ఒక పోస్ట్ కూడా పెట్టాడు. ఇక దాంతో తమిళ్ ప్రేక్షకులకు కూడా బేబీ సినిమారీచ్ అవ్వాలనే ఉద్దేశ్యంతో సాయి రాజేష్ ఈ సినిమాను రీమేక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారట. నటీనటులు కూడా తమిళ్ వల్లనే తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారట. అలాగే బాలీవుడ్ నుంచి కూడా బేబీ సినిమా రీమేక్ కు భారీగానే డిమాండ్ వస్తుందని టాక్. దీనిబట్టి చూస్తే బేబీ సినిమా క్రేజ్ రిలీజై ఇన్నాళ్లయినా తగ్గలేదని చెప్పాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు