Sai rajesh about baby movie : బేబీ బాలీవుడ్ రీమేక్ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్

Sai rajesh about baby movie

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించిన బేబీ గురించి అందరికి తెలిసిందే. మీడియం రేంజ్ సినిమాగా రిలీజ్ అయ్యి, ఈ ఏడాది సంచలన విజయం సాధించిన ఈ సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేయడంపై బేబీ సినిమా డైరెక్టర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.

జులై 14 న రిలీజైన బేబీ సినిమాని మాస్ మూవీ మేకర్స్ పై ఎస్ కే ఎన్ నిర్మించగా, సాయి రాజేష్ ఈ సినిమాని డైరెక్ట్ చేసాడు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటి వరకు 90 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవలనే ఓటిటిలో కూడా రిలీజైన ఈబేబీ సినిమా డిజిటల్ మీడియంలో కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది.

కాగా ఇక ఈ బేబీ సినిమాను పలు బాలీవుడ్ నిర్మాతలు హిందీలో రీమేక్ చేయాలనీ ప్రయత్నాలు చేస్తునట్టు, గత కొద్దీ రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. కాగా డైరక్టర్ సాయి రాజేష్ ఈ విషయంపై ఒక షార్ట్ వీడియోలో క్లారిటీ ఇచ్చాడు. బేబీ సినిమాను బాలీవుడ్ లో చూస్తే మీరే డైరెక్ట్ చేస్తారా అనే ప్రశ్నకు సమాధానంగా ఆయన ఖచ్చితంగా చేస్తాను… చేయాలనే ఆలోచన కూడా తనకు ఉన్నట్టు తెలిపారు. అయితే బాలీవుడ్ లో బేబీ సినిమా చేస్తే మాత్రం వేరే రకంగా చేస్తాను అంటూ క్లారిటీగా చెప్పుకొచ్చాడు. అలాగే బేబీ సినిమాకు తాను దర్శకుడిగా కేవలం 60% శాతం మాత్రమే హ్యాపీ గా ఉన్నానని తెలిపారు. ఇంకొన్ని రోజులు సమయం గనక ఉండింటే బేబీ సినిమా ఇంకా బాగా తీసేవాడినని ఆయన అభిప్రాయ పడ్డారు. ఇక దీన్ని బట్టి చూస్తే బేబీ సినిమా త్వరలోనే బాలీవుడ్ లో కూడా రాబోతుందని తెలుస్తుంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు