Baby movie: వైష్ణవి చైతన్యను ఆ హీరోయిన్ పచ్చి బూతులు తిట్టిందట ?

Baby movie

బేబీ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిన హీరోయిన్ వైష్ణవి చైతన్య గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ప్రస్తుతం నెట్ లో హల్చల్ చేస్తున్నాయి. బేబీ సినిమాకు ముందు టక్ జగదీష్, అలా వైకుంఠ పురంలో, రంగ్ దే సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన వైష్ణవి ని ఒక స్టార్ హీరోయిన్ సెట్ లో అందరి ముందు పచ్చి బూతులు తిట్టిందట దాంతో వైష్ణవి ఇక సినిమాలే వద్దు అనే స్టేజ్ కు కూడా వెళ్లిందట..

వివరాల్లోకి వెళ్తే .. యూట్యూబ్ లో షార్ట్స్ ఫిలిమ్స్ చేస్తూ పాపులరైన వైష్ణవి చైతన్య బేబీ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలలో నటించిన ఈ బేబీ సినిమా జులై 14 న రిలీజై, మీడియం రేంజ్ సినిమాలలో సంచలన విజయాన్ని సాధించింది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎస్ కే ఎన్ నిర్మించారు.

అయితే బేబీ సినిమాకు ముందు పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన వైష్ణవి చైతన్యను ఒక స్టార్ హీరోయిన్ అందరి ముందు దారుణంగా అవమానించిందట. వైష్ణవి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న సమయంలో ఒక సినిమా షూటింగ్ కు ఆర్టిస్ట్ గా వెళ్లగా ఆమెకు బట్టలు మార్చుకోడానికి కారవ్యాన్ ఇచ్చేవారు కాదంట. దాంతో బట్టలు మార్చుకోడానికి ఆమె చాలా ఇబ్బందులు పడేదంట. చాలా సార్లు బాత్ రూమ్ లలో బట్టలు మార్చుకునేదట.. ఆమె పరిస్థితి చూసిన వాళ్ళ అమ్మ చాలా సార్లు సినిమాలు వద్దు అనేదట. దాంతో వైష్ణవి వాళ్ళ అమ్మ బాధపడుతుందనే ఉద్దేశ్యంతో వైష్ణవి ఒకరోజు షూటింగ్ లో ఒక హీరోయిన్ దగ్గరికి వెళ్లి మీ కారవ్యాన్ లో బట్టలు మార్చుకోవచ్చా అని అడిగిందట. దానికి ఆ హీరోయిన్ నో చెప్పడమే కాకుండా వైష్ణవి ను అందరి ముందే దారుణంగా అవమానించిందట. ఇలాంటి సిచ్యువేషన్స్ కెరీర్ లో చాలానే పేస్ చేసిన వైష్ణవికి,  బేబీ సినిమా ఆమె జీవితాన్ని మార్చేసిందని చెప్పవచ్చు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు