Sai pallavi latest movie: సాయి పల్లవి ఆ సినిమాకైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా ?

Sai pallavi latest movie

మలయాళంలో వచ్చిన ప్రేమమ్ సినిమాతో సినీ ప్రేక్షకుల మనసు దోచుకున్న సాయి పల్లవి గురించి అందరికి తెలిసిందే. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో సౌత్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసిన సాయి పల్లవి, గత కొద్దీ కాలంగా సినిమాలకు దూరంగా ఉంటోంది. ఇటీవల కాలంలో ఆమె చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించినంత విజయం సాధించక పోవడంతో సాయి పల్లవి సినిమాలకు బ్రేక్ ఇచ్చిందని తెలుస్తోంది.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైనా ఈ బ్యూటీ, తన సొంత ఇండస్ట్రీ అయినా మలయాళంలో కంటే కూడా టాలీవుడ్ లోనే ఎక్కువ ఫ్యాన్స్ బేస్ ను సంపాదించుకుంది. స్టేజ్ పైన సాయి పల్లవి పేరు వినిపిస్తే చాలు ఆమె అభిమానులు అరుపులు, కేరింతలతో గోల గోల చేస్తారు. అయితే ఇంత అభిమానాన్ని సంపాదించుకున్న ఆమె తెలుగులో సినిమాలు చేయకపోవడంతో ఆమె అభిమానులు తీవ్రంగా నిరాశ పడుతున్నారు. ఆమె సోషల్ మీడియా ఎకౌంట్ లలో కూడా సాయి పల్లవి ని సినిమా చేయమంటూ కామెట్స్ చేస్తున్నారు.

కాగా లేటెస్ట్ గా ఒక పాన్ ఇండియా సినిమా కోసం తెలుగు ప్రొడ్యూసర్స్ ఆమెని అప్రోచ్ అయ్యారని టాక్ వినిపిస్తోంది. గీత ఆర్ట్స్ బ్యానర్ పై నాగ చైతన్య హీరోగా, చందు మొండేటి దర్శకత్వంలో రాబోతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా కోసం గాను హీరోయిన్స్ గా కీర్తి సురేష్ ను, సాయి పల్లవిని తీసుకోబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్ళవలసి ఉండగా, ఇప్పటి వరకు ఈ సినిమా డేట్స్ సాయి పల్లవి కన్ఫామ్ చేయలేదని టాక్ వినిపిస్తోంది . సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇస్తే అనుకున్నదానికంటే ముందే ఈ సినిమాని మొదలు పెట్టడానికి చూస్తున్నారు మేకర్స్. కానీ ఆమె మాత్రం ఇంకా యస్ ఆర్ నో చెప్పకపోవడంతో మూవీ టీం సాయి పల్లవి రిప్లై కోసం వెయిట్ చేస్తున్నారట.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు