Sai Pallavi : సిల్వర్ స్క్రీన్ పై సాయి పల్లవి దర్శనం ఇంకెప్పుడు?

what happened to Sai Pallavi

సాయి పల్లవి.. పేరుకి మలయాళం హీరోయిన్ అయిన తెలుగులో సాయి పల్లవి కి ఉన్న క్రేజ్ వేరు అనే చెప్పాలి. సినిమాలలో గ్లామర్ పాత్రలు చేయడానికి మాత్రమే ఎక్కువ ఆసక్తి చూపించే ఈతరం హీరోయిన్స్ లో సాయి పల్లవి మాత్రమే కథ, క్యారెక్టర్ లాంటి అంశాలు పరిగణలోకి తీసుకొని సినిమాలు చేస్తూ వస్తుంది.

ఫిదా సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన సాయి పల్లవి ఆ సినిమా తరువాత వరుస సినిమాలతో దూసుకుపోయింది. కానీ ఇటీవల కాలంలో ఈ హీరోయిన్ కు ఏమైందో ఏమో గాని సడన్ గా సినిమాలు చేయడం తగ్గించేసింది. అంతేకాదు తన దగ్గరకు వస్తోన్న ప్రొడ్యూసర్స్ కు డైరెక్టర్స్ ను కూడా సినిమా చేయలేను అంటూ వెనక్కి పంపించేస్తుందట. గతేడాది వచ్చిన గార్గి సినిమా తరువాత నుంచి సాయి పల్లవి ఇప్పటి వరకు ఏ సినిమా చేయలేదు. దాంతో సాయి పల్లవి సినిమాలు ఎందుకని చేయడం లేదో అనే విషయం ఎవరికి అర్థం కానీ ఒక మిస్టరీల తయారైంది.

అయితే సాయి పల్లవి వృత్తి రీత్యా డాక్టర్ అవడం మూలాన ఆ ప్రొఫెషన్ లో బిజీగా ఉంటూ సినిమాలు రిజెక్ట్ చేస్తుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.కాగా ఆమె అభిమానుల నుంచి సాయి పల్లవి మళ్ళీ సినిమాలు చేయాలని డిమాండ్ రావడంతో ఆమె ఇటీవలనే తమిళ్ లో శివ కార్తికేయన్ తో (SK21) ఒక సినిమా కమిట్ అయింది. కానీ ఈ సినిమాకు సంబందించిన ఏ అప్డేట్స్ ఇప్పటి వరకు రాలేదు. అలాగే సాయి పల్లవి అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తోన్న ఇండియాస్ మోస్ట్ యాన్టిస్పెటెడ్ చిత్రమైన పుష్ప ది రూల్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుందని వార్తలు వస్తున్నాయి. కానీ వీటిపై ఖచ్చితమైన క్లారిటీ లేదు. మరి ఈ ఏడాదైనా సాయి పల్లవి ని సిల్వర్ స్క్రీన్ పైచూసే అవకాశం ఆమె అభిమానులకు దక్కుతుందో లేదో చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు