Sreeleela Latest Movie: శ్రీలీల ఖాతాలో ఆ హ్యాట్రిక్ కాంబినేషన్ సినిమా

Sreeleela Latest Movie

మోస్ట్ హప్పెనింగ్ యాక్ట్రెస్ శ్రీలీల జోరు ఇప్పట్లో తగ్గేలా కనిపించట్లేదు. స్టార్ హీరోయిన్స్ సైతం స్టన్ అయ్యేలా వరుస సినిమాలతో దూసుకుపోతూ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా చెలామణి అవుతుంది. చిన్న పెద్ద హీరోల సినిమాలు అనే తేడా లేకుండా ఈ హీరోయిన్ కు ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా టాలీవుడ్ సూపర్ హిట్ కాంబినేషన్ గా పేరున్న ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా చేసే బంపర్ ఆఫర్ కొట్టేసింది ఈ బ్యూటీ.

రవితేజ- గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మైత్రి మూవీస్ బ్యానర్ పై ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఈగల్, టైగర్ నాగేశ్వర రావు సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించే సినిమాలో సెప్టెంబర్ నుంచి జాయిన్ అవుతాడని టాక్.

గతంలో రవితేజ- గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన డాన్ శీను, బలుపు, క్రాక్ సినినిమాలు సూపర్ హిట్ అవ్వగా.. ప్రస్తుతం వీరి కాంబో లో రాబోతున్న సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఇక రవితేజ తో ఇటీవలనే ధమాకా సినిమాలో నటించి మెప్పించిన శ్రీలీల మరోసారి ఆయన తో కలిసి స్టెప్స్ వేయడానికి రెడీ అయింది. థమన్ మ్యూజిక్ అందివ్వబోతున్న ఈ సినిమాకు ఇటీవలనే రిలీజైన జైలర్ సినిమాకు కెమెరా మెన్ గా పని చేసిన విజయ్ కార్తీక్ కన్నన్ డిఓపిగా వర్క్ చేయనున్నాడు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు