Balakrishna : భగవంత్ కేసరికి రిలీజ్ కష్టాలు

Balakrishna Bhagavanthkesari

నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ సినిమా భగవంత్ కేసరి కి రిలీజ్ కష్టాలొచ్చాయి. దసరా కానుకగా అక్టోబర్ 19 ఈ సినిమా విడుదల అవ్వబోతుందని ఇది వరకే ప్రకటించిన మూవీ టీం కి బాలయ్య గట్టి షాక్ ఇచ్చాడు. దాంతో ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ప్రస్తుతం తలలు పట్టుకొని కూర్చున్నారు. సినిమా రిలీజ్ దగ్గర పడుతుండగా బాలయ్య బిహేవియర్ పై వాళ్లకు ఏమి చేయాలో పాలు పోవడం లేదంట.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల ప్రధాన పాత్రలలో రాబోతున్న భగవంత్ కేసరి సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కొద్దీ రోజుల ప్యాచ్ వర్క్ మినహా సినిమా షూటింగ్ మొత్తం ఫినిష్ అయినట్టు తెలుస్తోంది. దాంతో ఇటీవలనే డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టాలని బాలయ్య తో చర్చించాలని చూస్తుంటే బాలయ్య ఫోన్ లకు రెస్పాండ్ అవడం లేదంట. భగవంత్ కేసరి మూవీ టీం ఎవరిని కూడా కలవడం ఇష్ట పడటం లేదంట. డబ్బింగ్ అంటే ఉత్సాహంగా స్టూడియో కి వెళ్లే బాలకృష్ణ సడన్ గా ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడని ఆరా తీయగా భగవంత్ కేసరి సినిమాకు గాను ఆయనకు రావాల్సిన రెమ్యునరేషన్ ఇంకా ఇవ్వలేదంట ప్రొడ్యూసర్స్.

దాంతో బాలకృష్ణకు షైన్ స్క్రీన్ బ్యానర్ ప్రొడ్యూసర్స్ కు మనస్పర్ధలు వచ్చాయని టాక్. అందరి హీరోల్లో తక్కువ రెమ్యునరేషన్ తనదే అయినప్పటికీ తనకు రెమ్యునరేషన్ సరిగ్గా ఇవ్వడం లేదని బాలయ్య ప్రొడ్యూసర్స్ పై అసంతృప్తిగా ఉన్నారట. దీంతో భగవంత్ కేసరి సినిమా డబ్బింగ్ దశలోనే ఆగిపోయిందని ఫిలిం నగర్ టాక్. ఉగ్రం సినిమా వల్ల ప్రస్తుతం లాస్ లో ఉన్న షైన్ స్క్రీన్ బ్యానర్ ప్రొడ్యూసర్స్ బాలయ్య కు రెమ్యునరేషన్ ఇచ్చే పరిస్థితి లేదు. అటు చూస్తే రెమ్యునరేషన్ ఇవ్వనిదే బాలయ్య డబ్బింగ్ చెప్పేలా లేదు. ఈ గొడవ గనక సద్దుమణగపోతే అక్టోబర్ 19కి సినిమా రిలీజ్ అవ్వడం కష్టమే అని తెలుస్తోంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు